జిల్లాలో 30, 30(ఎ) పోలీస్‌ యాక్ట్ అమలు : ఎస్పీ రాజేష్ చంద్ర

by Nallavelli.Anjaneyulu |

దిశ, కామారెడ్డి : జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని నెల రోజుల పాటు అన‌గా అక్టోబ‌ర్ 01 నుంచి 31 వ‌ర‌కు జిల్లా వ్యాప్తం గా 30, 30(ఎ)

జిల్లాలో 30, 30(ఎ) పోలీస్‌ యాక్ట్ అమలు :  ఎస్పీ రాజేష్ చంద్ర
X

దిశ, కామారెడ్డి : జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని నెల రోజుల పాటు అన‌గా అక్టోబ‌ర్ 01 నుంచి 31 వ‌ర‌కు జిల్లా వ్యాప్తం గా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. దీని ప్రకారం.. పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. అలాగే ప్రజా ధనానికి నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తమకు ఈ విషయంలో సహకరించాలని కోరారు.

Next Story