అనుమతి ఇంత.. కట్టేది కొండంత

by Dishafeatures2 |
అనుమతి ఇంత.. కట్టేది కొండంత
X

దిశ, పిట్లం: పిట్లం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. పిట్లం మండల కేంద్రంలోని బాన్సువాడ రోడ్డు లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. నిబంధనల ప్రకారం పిట్లం గ్రామ పంచాయతీ పరిధిలో జీ ప్లస్ 2 కు అనుమతి ఉండగా.. అందుకు విరుద్ధంగా 4 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. పంచాయతీ నుండి జీ ప్లస్ 2 అనుమతి పొంది 3, 4 అంతస్తుల భవనాలు యథేచ్ఛగా నిర్మిస్తున్నారు. ఇంతా తతంగం జరుగుతున్నప్పటికీ పంచాయతీ కార్యదర్శి నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహరించడం శోచనీయం. పంచాయతీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగితే ఉక్కు పాదం మోపాల్సిన ఆధికారులు పట్టనట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.


మండల పంచాయతీ అధికారి వివరణ

ఇట్టి విషయమై మండల పంచాయతీ అధికారి వివరణ కోరగా.. గ్రామ పంచాయతీ నిబద్ధనలకు విరుద్ధంగా ఎలాంటి నిర్మాణం జరిగినా గ్రామ పంచాయతీ సెక్రటరీదే బాధ్యత అని చెప్పారు. అక్రమ నిర్మాణాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత జీపీ సెక్రటీరీపై ఉంటుందని స్పష్టం చేశారు. కార్యదర్శి మాత్రం తూతూమంత్రంగా నోటీసులచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఏమైనా అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవాల్సిన అధికారే ఇలా ఏం పట్టనట్టు వ్యవరించడంలో మతలబేంటో అర్థంకాక స్థానికులు జుట్టుపట్టుకుంటున్నారు. ఇక ప్రభుత్వాధికారులు స్పందించి నాటికి భవనాల నిర్మాణం పూర్తై గృహ ప్రవేశాలు కూడా అయిపోతాయని గ్రామస్థులు ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటికైనా జీపీ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story