- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంగన్ వాడి స్థలంలో అక్రమ నిర్మాణాన్ని తొలగించాలి
దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామ అంగన్ వాడి కేంద్రం స్థలంలో అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని వెంటనే తొలగించాలని జిల్లా శిశు

దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామ అంగన్ వాడి కేంద్రం స్థలంలో అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని వెంటనే తొలగించాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిణి ప్రమీల ఆదేశించారు. మంగళవారం మండలంలోని సుల్తాన్ నగర్ అంగన్ వాడి కేంద్రం తోపాటు, మహమ్మద్ నగర్ మండలంలోని హాసన్ పల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రాలను బాన్స్ వాడ, ఎల్లారెడ్డి ఐసిడిఎస్ సిడిపిఓ లతో కలిసి తనిఖీ చేశారు. అంగన్వాడి కేంద్రాలలో హాజరు రిజిస్టర్ లను తనిఖీ చేశారు. నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ అంగన్వాడీ కేంద్రం పరిశుభ్రంగా లేకపోవడంతో పాటు, అంగన్వాడి కేంద్రం స్థలంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్రమంగా కబ్జా చేసి అంగన్వాడి కేంద్ర భవనానికి చెందిన కిటికీలు తెరువడానికి వీలు లేకుండా కేంద్ర భవనానికి ఆనుకొని అక్రమంగా ఇల్లు నిర్మించడంతో అంగన్వాడి కేంద్రంలో ఉన్న గుడ్లు, ఇతర వస్తువులతో దుర్వాసన వెదజల్లుతూ ఉండడంతో, కేంద్రంలో పిల్లలు ఉండలేకపోతున్నారని, అక్రమంగా నిర్మించిన కట్టడం గురించి ఉన్నతాధికారులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని అంగన్వాడి టీచర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడి స్థలంలో అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని తొలగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి స్థానిక తహసిల్దార్ కు, ఎంపీడీవో కు ఫిర్యాదు చేస్తామని ఆమె అన్నారు. అంగన్వాడి కేంద్రాలలో పరిశుభ్రత పాటించి చిన్నారులకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు సక్రమంగా పౌష్టికారాన్ని అందజేయాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఐసిడిఎస్ సిడిపిఓ సౌభాగ్య, ఎల్లారెడ్డి అడిషనల్ సిడిపిఓ ప్రసన్న, సూపర్వైజర్ రాజేశ్వరి, అంగన్వాడీ టీచర్లు సుశీల పాల్గొన్నారు.






