- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టు జారితే.. ప్రాణాలు గాల్లోకే..!
ఓపక్క రోడ్డు ప్రమాదాలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం అరైవ్.. అలైవ్.. డిఫెన్సివ్ డ్రైవింగ్.. పేరుతో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఓపక్క రోడ్డు ప్రమాదాలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం అరైవ్.. అలైవ్.. డిఫెన్సివ్ డ్రైవింగ్.. పేరుతో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. రోడ్డు ప్రమాదాల పై పోలీసులు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను, యువతను సురక్షిత ప్రయాణం గురించి చైతన్య పరుస్తున్నారు. కానీ ఆర్మూర్ పట్టణం, నిజామాబాద్ వంటి నగరాల్లో ఆటోలు, ట్రాలీ వెహికిల్స్ లో పరిమితికి మించి ప్రమాదకరంగా వేళాడుతూ ప్రయాణిస్తున్నారు. రోడ్ల పై పోలీసుల నిఘా ఉన్నా.. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉన్నప్పటికీ.. తమకేది పట్టదన్నట్టు కొందరూ సిగ్నల్స్ దాటి జంప్ చేసి వెళ్తున్నారు. పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రమాదాలు నివారణ ఎలా సాధ్యమయ్యేనో పోలీసులే చెప్పాలి. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ ప్రాంతంలో యువకులు ట్రాలీ వెహికిల్ పై వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తుండగా పలువురు దాని గురించే చర్చింకోవడం కనిపించింది.






