తాడ్వాయి ZPTC జనరల్ అయితే.. ఇక రణరంగమేనా..?

by Nallavelli.Anjaneyulu |

దిశ,​ తాడ్వాయి : మండల రాజకీయాల్లో జెడ్పీటీసీ ఎన్నికల సెగ అప్పుడే మొదలైంద అంటే అవుననే వినిపిస్తుంది.రాబోయే

తాడ్వాయి ZPTC  జనరల్ అయితే.. ఇక రణరంగమేనా..?
X

దిశ,​ తాడ్వాయి : మండల రాజకీయాల్లో జెడ్పీటీసీ ఎన్నికల సెగ అప్పుడే మొదలైంద అంటే అవుననే వినిపిస్తుంది.రాబోయే రిజర్వేషన్లలో తాడ్వాయి స్థానం గనుక జనరల్ కేటగిరీకి కేటాయిస్తే,ఈసారి ఎన్నికలు సాధారణంగా ఉండబోవని,ఒక యుద్ధంలా సాగుతాయని స్పష్టమవుతోంది.ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ,బీఆర్ఎస్ పార్టీల నుంచి హేమాహేమీలు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుండటంతో సామాన్య ఆశావహుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

జనరల్ రిజర్వేషన్.. దిగ్గజాల ఎంట్రీ తప్పదా..?

​తాడ్వాయి జెడ్పీటీసీ స్థానాన్ని దక్కించుకుని,ఆపై జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని అధిరోహించాలని నియోజకవర్గ స్థాయికి చెందిన ఇద్దరు అగ్ర నేతలు పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు మండలంలో జోరుగా చర్చ సాగుతోంది.ఒకవేళ రిజర్వేషన్ జనరల్ అయితే,ఈ ఇద్దరు దిగ్గజాలు నేరుగా ఎన్నికల క్షేత్రంలోకి దూకుతారని,అప్పుడు పోరు రెండు నుంచి మూడు అంకెల కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆశావహుల ఆశలు అడియాశలేనా?

​ఇప్పటికే మండల స్థాయి నుంచి జెడ్పీటీసీ రేసులో ఉన్న అనేకమంది నాయకులు రిజర్వేషన్లపై ఆందోళన చెందుతున్నారు. హేమాహేమీలు రంగంలోకి దిగితే తమ పరిస్థితి ఏంటని వారు తలలు పట్టుకుంటున్నారు.పార్టీల అధిష్టానాలు సైతం గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చే అవకాశం ఉండటంతో, గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్న సీనియర్లు రంగంలోకి దిగుతారని అంచనాలు ఉండడంతో స్థానిక ఆశావహుల ఆశలు తలకిందులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

మున్సిపల్ ఎన్నికల క్లారిటీ కోసమే ఎదురుచూపులు..

ప్రభుత్వం ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తుందా? లేక జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తుందా? అన్న సందిగ్ధత ఇంకా వీడలేదు.ఈ అంశం కొలిక్కి వస్తేనే,ఆ ఇద్దరు హేమాహేమీలు ఎవరు?వారు తదుపరి అడుగు వేస్తారని సమాచారం.మున్సిపల్ ఎన్నికల ముగింపు లేదా ప్రకటనను బట్టి వారి వ్యూహాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉండటంతో, ప్రస్తుతం తాడ్వాయి రాజకీయం మొత్తం వేచి చూసేధోరణిలో ఉంది.​ఏది ఏమైనా,తాడ్వాయి జెడ్పీటీసీ స్థానం ఇప్పుడు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే హాట్ టాపిక్‌గా మారింది.రిజర్వేషన్ ప్రకటన వెలువడదంతో పాటు మున్సిపల్ ఎన్నికలపై క్లారిటీ వస్తే ఇక అసలు ఆట మొదలవుతుందని జోరుగా చర్చ కొనసాగుతుంది.మొత్తానికి తాడ్వాయి జెడ్పీటీసీ స్థానం రాబోయే రోజుల్లో హాట్ సీట్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story