- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను పొరపాటు చేయను,మీరు చేస్తే ఊరుకోను.. కామారెడ్డి ఎమ్మెల్యే సైలెంట్ వార్నింగ్
తాను ఎటువంటి పొరపాటు చేయనని, నిక్కచ్చిగా ఉంటానని, ఎవరైనా తప్పు చేస్తే ఏమాత్రం ఊరుకోనని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి తప్పు చేసే అధికారులకు సైలెంట్ గా వార్నింగ్ ఇచ్చాడు.

దిశ,భిక్కనూరు : తాను ఎటువంటి పొరపాటు చేయనని, నిక్కచ్చిగా ఉంటానని, ఎవరైనా తప్పు చేస్తే ఏమాత్రం ఊరుకోనని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి తప్పు చేసే అధికారులకు సైలెంట్ గా వార్నింగ్ ఇచ్చాడు. గురువారం నాడు ఆయన భిక్కనూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో అన్ని శాఖల అధికారులతో సుమారు మూడు గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి సమస్య ఉన్నా, తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. సమస్యల పరిష్కార విషయంలో ఏమైనా అత్యవసరమైతే నేరుగా కామారెడ్డి లోని క్యాంప్ కార్యాలయానికి వచ్చి తనను కలవచ్చన్నారు. అంతేకాకుండా ఫోన్ చేసి కూడా మాట్లాడవచ్చన్నారు.
అంతకుముందు మూడు గంటల పాటు శాఖల వారీగా నిర్వహించిన రివ్యూ సమావేశంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కో అధికారి లేచి శాఖలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్యం లోపించి, దోమలు స్వైర విహారం చేస్తున్నాయని, పారిశుద్ధ్య కార్మికులు, వాటర్ మెన్లకు వేతనాలు సరిగా అందకపోవడం వలన, కుటుంబ పోషణ భారమై పని మానేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖపై జరిగిన సమీక్షలో ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
గత ఏడాదిన్నర కాలంగా వైద్య ఆరోగ్య కేంద్రంలో కంటిజెన్సీ వర్కర్స్ లేకపోవడం వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్య శాఖ పై జరిగిన సమీక్షలో ఆయన దృష్టికి తెచ్చారు. సమస్యలను తెలుసుకున్న ఆయన, ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేస్తానని, సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూస్తానని పేర్కొన్నారు. అధికారులు అంటే తనకు గౌరవమని, ఇప్పుడు మృదు స్వభావం తో మాట్లాడుతున్నానని, మళ్లీ జరిగే రివ్యూ సమావేశంలో ఎవరైనా అధికారులు తప్పు చేసినట్లు తెలిస్తే ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.






