- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య
దిశ, భిక్కనూరు : భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో సోమవారం

దిశ, భిక్కనూరు : భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీబీపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన గోర్కంటి స్వామి (26) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగు సంవత్సరాల క్రితం మండలంలోని మల్లు పల్లి గ్రామానికి చెందిన శిరీష ను పెళ్లి చేసుకున్నాడు. గత ఏడాది కాలంగా భార్య, భర్తల మధ్య గొడవలు మొదలవుతుండడంతో వాటిని భరించలేక భార్య శిరీష పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భార్య కాపురానికి రాకపోవడంతో భర్త స్వామి తీవ్ర మనస్థాపానికి గురవుతున్నాడు. పెద్ద మల్లారెడ్డి గ్రామంలోని సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి కూతురుతోపాటు తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని మార్చురీకి తరలించినట్లు ఎస్.ఐ. డి. ఆంజనేయులు వివరించారు.






