- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ- డీ కులానికి చెందిన వ్యక్తికి ఎస్టీ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు..?
దిశ, రాజంపేట : మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన బిసి-డి ముత్యాల కులానికి చెందిన కొందరు వ్యక్తులు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం

దిశ, రాజంపేట : మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన బిసి-డి ముత్యాల కులానికి చెందిన కొందరు వ్యక్తులు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం పొంది స్థానిక సర్పంచ్ ఎలక్షన్ లో ముత్యాల రవీందర్ నాలుగు ఓట్ల మెజార్టీతో ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి పై గెలుపొందారని అన్నారం తాండ గ్రామస్తులు పేర్కొన్నారు. బీసీ - డీ కులానికి చెందిన వ్యక్తులు ఎన్నికల సమయంలో నామినేషన్ వేయడంతో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, సంబంధిత అధికారులు విచారణ జరిపి 2015 ముందు స్కూల్ రికార్డ్ ప్రకారం బీసీ-డీ కులం వాళ్లుగా గుర్తించబడ్డారు. గతంలో ఉన్న ఫేక్ సర్టిఫికెట్ ప్రకారం ఎస్టి సర్టిఫికెట్ పొంది స్థానిక ఎన్నికల్లో పాల్గొన్నారాని తెలిపారు. ఈ విషయంలో విచారణ చేపట్టి స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థత్వాన్ని రద్దు చేయాలని తహసీల్దార్ జానకి వినతి పత్రం అందజేశారు. గ్రామ జీపీఓ, ఆర్ఐ ఏ విధంగా ఎంక్వయిరీ చేసి వాళ్లకు ఎస్టీ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు. వారికి ఎస్టీ ధ్రువీకరణ పత్రం ఏ విధంగా జారీ చేశారు గ్రామస్తులకు తెలియజేయాలని తహసీల్దార్ జానకి విన్నవించారు.






