వ్యవసాయ వలస కూలీలకు సన్మానం..

by Batti.Sumithra |

పొట్టకూటి కోసం బీహార్ నుండి వలసవచ్చిన వ్యవసాయ కూలీలకు నందిగామకు చెందిన కౌలురైతు సంజీవ్ సన్మానం చేసినగదు అందించారు.

వ్యవసాయ వలస కూలీలకు సన్మానం..
X

దిశ, నవీపేట్ : పొట్టకూటి కోసం బీహార్ నుండి వలసవచ్చిన వ్యవసాయ కూలీలకు నందిగామకు చెందిన కౌలురైతు సంజీవ్ సన్మానం చేసినగదు అందించారు. బీహార్ నుండి వలస వచ్చిన నాట్లువేసే కూలీలు తన కౌలుపొలం ఇరవై ఐదు ఎకరాల్లో నాట్లు ముగించుకున్నారు.

బిహార్ కు తిరిగి వెళుతున్న సందర్భంగా కౌలు రైతు డి.సంజీవ్ కార్మికులను తన ఇంటికి‌ ఆహ్వానించి ఘనంగా సన్మానించి దారి ఖర్చులకు ఐదు వేల రూపాయల నగదు అందజేయడంతో కూలీలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు శోభన్, మహాదేవ్, శివరాంసాయి, తదితరులు పాల్గొన్నారు.

Next Story