అచ్చంపేట‌లో ఘ‌నంగా కుస్తీ పోటీలు

by Nallavelli.Anjaneyulu |

నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో శనివారం రామాలయం మందిరం వద్ద కుస్తీ పోటీలను నిర్వహించారు.

అచ్చంపేట‌లో ఘ‌నంగా కుస్తీ పోటీలు
X

దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో శనివారం రామాలయం మందిరం వద్ద కుస్తీ పోటీలను నిర్వహించారు. ప్రాచీన సంప్రదాయాలను సజీవంగా నిలుపుతూ యువతలో స్పూర్తిని రగిలించేలా ఈ కుస్తీ పోటీలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు ఏర్పాటు చేయగా.. ఈ కుస్తీ పోటీలను తిలకించేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కుస్తీ పోటీలలో తలపడేందుకు చుట్టుపక్కల మండలాల తోపాటు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చారు.

చిన్నారుల నుంచి మొదలైన కుస్తీ పోటీలలో మల్లయోధులు ఆసక్తి చూపించారు. పది రూపాయలతో ప్రారంభమైన కుస్తీ పోటీలు రూ.వెయ్యి వరకు కొనసాగాయి. చిట్ట చివరి కుస్తీ గెలుపొందిన వారికి 2500 రూపాయల నగదు బహుమతిని కుస్తీ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నగదు బహుమతితో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంకు లక్ష్మయ్య, ఉప సర్పంచ్ రవీందర్, నాయకులు డిసిసి ప్రధాన కార్యదర్శి మంద బలరాం, బంగ్లా ప్రవీణ్ కుమార్, చాకలి రమేష్, సంకు సాయిలు, బొడ్డు అంజయ్య, ఎర్రోళ్ల సాయిలు,మంగలి ఎల్లయ్య, గ్రామ పరిపాలన అధికారి సంగమేశ్వర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి తుకారం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story