- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామారెడ్డిలో భారీ వర్షం.. మరోసారి జలమయం..!
దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇవాళ భారీ వర్షం సంభవించింది. ఇటీవలే వర్షం బీభత్సం సృష్టించి కామారెడ్డి జిల్లా కేంద్రం సగం వరకు

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇవాళ భారీ వర్షం సంభవించింది. ఇటీవలే వర్షం బీభత్సం సృష్టించి కామారెడ్డి జిల్లా కేంద్రం సగం వరకు మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా భారీ వర్షం కురవడంతో మరోసారి కామారెడ్డికి ముప్పు తప్పదా..? అని భయ బ్రాంతులకు గురవుతున్నారు. దాదాపు గంటన్నర పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి పట్టణంలోని లోతట్టు కాలనీలన్నీ ముంపునకు గురయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
జలమయమైన రోడ్లు
వర్షానికి ప్రధాన రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బతుకమ్మ కుంట, అయ్యప్ప నగర్, వాసవి నగర కాలనీల్లోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్లే రోడ్డు పూర్తిగా జలమయమైంది. విద్యానగర్ కాలనీ, ఎన్జీవోస్ కాలనీ, అశోక్ నగర్ కాలనీల్లో భారీగా వర్షపు నీరు చేరుకుంది. స్టేషన్ రోడ్డు, సిరిసిల్లా రోడ్, జేపీఎన్ రోడ్, సుభాష్ రోడ్లపై నుంచి వర్షపు నీరు ప్రవహించింది.
తడిసిన తిండి గింజలు
భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరడంతో ఇళ్లలోని తిండి గింజలు నానిపోయాయి. పప్పు దినుసులు, బియ్యం, ఇతర వస్తువులు తడిసి ముద్దయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకనే..
పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లనే వర్షాలు కురిసిన ప్రతిసారి ఇళ్లల్లోకి నీరు వస్తుందని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.






