- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గరంగరంగా ఆర్మూర్ రాజకీయం.. చైర్మన్ పీఠం కోసం పోటాపోటీ
మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపడంతో ఒక్కసారిగా పట్టణాల్లో ఎన్నికల సందడి నెలకొన్నది. ఆశావహులు హుషారుతో ఉన్నారు.

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి ప్రారంభమైంది. మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపడంతో ఒక్కసారిగా పట్టణాల్లో ఎన్నికల సందడి నెలకొన్నది. ఆశావహులు హుషారుతో ఉన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అధికారులు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పట్టణాల్లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఓవైపు టికెట్ల కోసం పార్టీ నేతలను కలుస్తున్నారు. మరో వైపు ఓటర్లను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం ఎదురుచూస్తూ డివిజన్లలో ప్రజలతో మమేకమై పోటీకి సిద్ధమవుతున్న నాయకులు, ఆశావహులు కొత్త నేతల రాకతో బెంబేలెత్తుతున్నారు. ఆశావహులు టికెట్ల కోసం ఓవైపు, ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు మరోవైపు తెల్లవారు జామున నుంచి రాత్రి వరకు తిరుగుతూనే ఉన్నారు. తప్పకుండా పోటీలో ఉండాలనుకుంటున్న నాయకులు తమకు అనుకూలమైన వార్డు ఏదైతే బాగుంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఏ వార్డులోకి వెళ్లి పోటీ చేస్తే గెలవగలం అనే అంచనాల్లో తలమునకలయ్యారు. ఆ వార్డులకు చెందిన ప్రధాన నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ప్రజల్లో మంచి గుర్తింపు ఉండి ఆర్ధికంగా బలంగా ఉన్నవారికి టికెట్లు ఇవ్వాలని ప్రధాన పార్టీలు బావిస్తున్నాయి. అభ్యర్ధుల ఎంపిక కోసం ప్రధాన పార్టీలు గెలుపు అవకాశాలు, ఆర్ధిక స్థితిగతులను పరిగణలోకి తీసుకోని అభ్యర్ధులను ప్రాథమికంగా ఖరారు చేయనున్నాయి.
దిశ, ఆర్మూర్ :
గత ఏడాది చివరిలో పంచాయతీ ఎన్నికల్లో తడిసి ముద్దయిన నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రాంత ప్రజలకు ఈ ఏడాది ప్రారంభంలోనే మున్సిపల్ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇటీవల మున్సిపాలిటీ ఎన్నికల కోసం అధికారులు ఓటర్ల జాబితాను ప్రకటించడం, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు వార్డుల వారీగా రిజర్వేషన్లను ప్రకటించడంతో మున్సిపల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఆర్మూర్ మున్సిపల్ లోని మెజారిటీ కౌన్సిలర్ స్థానాలను దక్కించుకొని మున్సిపాలిటీ పై వారి పార్టీల జెండాలను ఎగరవేయాలన్న వ్యూహరచనతో ఆర్మూర్ నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు, నాయకులు వారి పదునైన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఆర్మూర్ బల్దియా కౌన్సిలర్ బాదుషాల కోసం పార్టీలోని నియోజకవర్గ అధినాయ కత్వం ముమ్మర వేటను చేపడుతుంది. ఆర్మూర్ మున్సిపల్ లో అధికార కాంగ్రెస్ తో పాటు, బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడేందుకు ముందస్తుగా వార్డుల వారీగా గెలుపు గుర్రాలను అన్వేషించే పనిలో నిమగ్నమయ్యాయి. మూడు పార్టీలకు చెందిన నియోజకవర్గ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ బాదుషాలను వారి పార్టీ వారిని గెలిపించుకునే పనిలో నిమగ్నమయ్యారు. వార్డుల్లో ప్రజల ఆదరణ, కుల బల సమీకరణాలు ఉన్న వారిని గుర్తిస్తూ కాసుల బలం ఉంటే కండువాలు కప్పేందుకు తీవ్ర వ్యూహా రచనలు చేస్తున్నారు. డబ్బు, కుల బలం, వార్డు ప్రజల మద్దతు సమీకరణల మధ్య ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల పోరు తీవ్ర ఆస్తికరంగా జరగనుంది.
గత ఏడాది జరిగిన పల్లె పంచాయితీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మెజారిటీగా విజయం సాధించడంతో మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించడం కోసం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చకచకా అడుగులు వేసి ముందుకు సాగింది. జిల్లా కేంద్రంలోని కార్పొరేషన్ తో పాటు, ఆర్మూర్, బోధన్, భీంగల్ మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణ కోసం ఈ ఏడాది ప్రారంభంలో అధికారులు ఓటర్ల జాబితాను ప్రకటించడంతో పాటు, ఇటీవల ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కార్పొరేషన్, మున్సిపాలిటీల వార్డుల వారీగా రిజర్వేషన్లను ప్రకటించారు. ఓటర్ల జాబితా ప్రకటన తర్వాత పార్టీల నాయకులతో కలిసి కార్పొరేషన్ మున్సిపాలిటీల వారిగా అధికారులు ఓటర్ జాబితాల అభ్యంతరాలపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇందూరు జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ లో మున్సిపల్ పోరు ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపల్ లో మొత్తం 36 వార్డులు ఉండగా, అన్ని వార్డుల్లో పురుషుల కంటే మహిళల ఓట్ల సంఖ్యనే కాస్త ఎక్కువగా ఉంది. ఆర్మూర్ మున్సిపల్ లోని అన్ని వార్డుల్లో మహిళల మద్దతు కలిగిన వారే మున్సిపల్ కౌన్సిలర్ బాదుషాలుగా నిలవనున్నారు.
కాసులు ఉంటేనే కండువాలు కప్పేందుకు సిద్దం
మున్సిపల్ లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముక పోరు జరగనుంది. ఏది ఏమైనా ఆర్మూర్ మున్సిపల్ పై వారి వారి పార్టీల జెండాలను ఎగురవేయాలి అన్న ఆలోచనతో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు వారి చురుకైన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ ముగ్గురు నియోజకవర్గ స్థాయి నాయకులు ఇతర పార్టీలకు చెందిన ధన బలం, కుల సామాజిక సమీకరణలు కలిగిన, ప్రజల్లో ఆదరణ కలిగి ఉండి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందే సత్తా కలిగిన నాయకులను వారి పార్టీల్లో చేర్చుకునేందుకు కండువాలు కప్పే కార్యక్రమాలు ఆర్మూర్లో ఊపందుకున్నాయి. ఆర్మూర్ మున్సిపల్ లో పుర ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి జంపింగ్ జపాంగులు జోరందు కున్నాయి. ఆర్మూర్ బల్దియా పై ఈ నియోజకవర్గ ముగ్గురు నాయకుల్లో ఎవరు పై చేయి సాధించి వారి పార్టీల కండువాలను బల్దియా పై ఎగరవేయనున్నారోనానే ఆసక్తి ప్రజల్లో ఎక్కువైంది.






