పాస్‌పోర్టు విచారణలో నిర్లక్ష్యం.. హెడ్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు

by Bhanu |   (  Updated:2025-05-07 11:06:37  IST  )

గత ఏడాది పాస్‌పోర్టు విచారణలో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు హెడ్ కానిస్టేబుల్ పి.కృష్ణను సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.

పాస్‌పోర్టు విచారణలో నిర్లక్ష్యం.. హెడ్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు
X

దిశ, కామారెడ్డి : గత ఏడాది పాస్‌పోర్టు విచారణలో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు హెడ్ కానిస్టేబుల్ పి.కృష్ణను సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. టేకుల రాజయ్య పాస్‌పోర్టు దరఖాస్తు పై విచారణ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. కనీస ప్రాథమిక పరిశీలన లేకుండానే క్లియరెన్స్ ఇచ్చారని తెలిపారు. సమగ్ర విచారణ చేయకపోవడంతో రాజయ్యకు అంతకు ముందే రాజు పేరుపై ఉన్న పాస్‌పోర్టు గురించి తెలుసు కోలేకపోయారన్నారు.


దీంతో రాజయ్య పై ఆర్జీఐ ఎయిర్ పోర్ట్ పోలీసు స్టేషన్లో కేసు కూడా నమోదు అయిందన్నారు. ఈ విషయం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర దృష్టికి రాగా పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని ఇంచార్జ్ డిఐజికి నివేదిక పంపించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన ఇంచార్జ్ డి ఐ జి బాధ్యతారాహిత్యానికి బాధ్యుడైన హెడ్ కానిస్టేబుల్ కృష్ణను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Next Story