- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ భారతికి కన్నం పెట్టారా..?
ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి భూభారతి పోర్టల్ లో నెలకొన్న సాఫ్ట్ వేర్ లొసుగులకు కన్నం వేయాలని చూశారో..? ఏమో తెలియదు.

దిశ, భిక్కనూరు : ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి భూభారతి పోర్టల్ లో నెలకొన్న సాఫ్ట్ వేర్ లొసుగులకు కన్నం వేయాలని చూశారో..? ఏమో తెలియదు. కానీ డాక్యు మెంటేషన్ రైటర్ల పై విచారణ చేయగా.. నాలుగు కేసులలో మూడు క్యాన్సిల్ అయ్యాయి మరొకటి మాత్రం అనుమానంగా ఉండడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు తహశీల్దార్ కార్యాలయంలో 2021, 22, 23 సంవత్సరాల్లో మండల కేంద్రానికి చెందిన డాక్యుమెంటేషన్ రైటర్లు కొందరు రైతుల భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను విషయంలో దరఖాస్తుదారునితో లోపాయి కారి ఒప్పందం కుదుర్చుకొని పన్ను తక్కువ అయ్యేలా చేసి, పెద్ద మొత్తంలో లాభం పొందారన్న ఆరోపణ వచ్చింది. అదే సమయంలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడంతో, పాత ధరతోనే రిజిస్ట్రేషన్ చార్జీలు కట్టించుకొని రిజిస్ట్రేషన్ చేయించారని మరో ఆరోపణ ప్రచారంలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా భూభారతి పోర్టల్ ద్వారా జరిగిన అవకతవకలపై ప్రభుత్వం విచారణ మొదలు పెట్టిన నేపథ్యంలో అన్ని జిల్లాలో ఎంక్వైరీ కొనసాగుతోంది. దీంట్లో భాగంగా కలెక్టర్ ఆశిష్ సం గ్వాన్ ఆదేశాల మేరకు స్థానిక తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, కార్యాలయం సమీపంలో ఉన్న డాక్యుమెంటేషన్ రైటర్ల వద్దకు వెళ్లి విచారణ చేపట్టగా పలు విషయాలు ఆశ్చర్యాన్ని గురిచేసాయి.
పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలకు అనుగుణంగా ఛలాన్ కట్టించుకోకపోవడంతో ఆ రిజిస్ట్రేషన్ లలో మూడింటిని క్యాన్సిల్ చేశారని, మరొకటి సస్పెన్స్ గా ఉన్నట్లు నిన్న సిబ్బంది జరిపిన విచారణలో తేలింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా, రిజిస్ట్రేషన్ ఎందుకు క్యాన్సిల్ అయ్యాయన్న విషయమై పూర్తి విచారణ చేసి రిపోర్ట్ తయారు చేసి పంపాలని కలెక్టర్ ఆర్డర్స్ ఇష్యూ చేయడంతో అక్కడికి వెళ్లి సిబ్బంది విచారణ చేసి రిపోర్ట్ తయారుచేసి పంపించారు. ఇద్దరు డాక్యుమెంట్ రైటర్ల వద్ద నాలుగు కేసులు వెలుగులోకి రావడంతో ఈ విషయమై ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. భూభారతి స్లాట్ బుకింగ్ నిర్వహాకులు ప్రత్యేక సాఫ్ట్ వెర్ ద్వారా స్లాట్ బుకింగ్ చేశారా..? లేక ఇతర ప్రత్యేక యాప్ ద్వారా బుకింగ్ చేశారా అన్న వివరాలు తహసీల్దారు అధికారులు పరిశీంచారు. వాస్తవానికి రిజిస్ట్రేషన్ సమయంలో ఒకేసారి చెల్లించిన డబ్బులు రెండు ధఫలుగా విడిపోయి చాలాన్ బయటకు వస్తుంది. అందులో ఒకటి స్టాంప్ డ్యూటీ ఛార్జిలు కాగా మరొకటి నగదు ఇతర ఛార్జీలు ఉంటాయి. ఒక నగదు ప్రభుత్వ ఖాతాలోకి వెళ్ళగా మరొ నగదు ప్రభుత్వ ఖాతాలో జమ కాకుండా ఇతరుల ఖాతాలోకి వెళ్ళుతున్నట్లు సమాచారం. ఈ వివరాలపై జిల్లా రెవెన్యూ అధికారులు తనిఖీలు భూభారతి రిజిస్ట్రేషన్ నిర్వహాకుల వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఏమైనా అవకతవకలకు పాల్పడి బుకింగ్ చేశారా లేదా సక్రమంగానే బుకింగ్ చేశారా అనే వివరాలు తనిఖీలు చేసిన అధికారులు వెల్లడించాల్సి ఉంది.






