మంత్రి వేముల ఇంటికి హరీష్ రావు.. ప్రశాంత్ రెడ్డికి ధైర్యం చెప్పిన మినిస్టర్

by Bhoopathi Nagaiah |

రాష్ట్ర రోడ్డు భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.

మంత్రి వేముల ఇంటికి హరీష్ రావు.. ప్రశాంత్ రెడ్డికి ధైర్యం చెప్పిన మినిస్టర్
X

దిశ ఆర్మూర్ : రాష్ట్ర రోడ్డు భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. సోమవారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రి వేములను వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ సందర్భంగా వేముల స్వగృహంలో ఆయన తల్లి మంజులమ్మ చిత్రపటానికి హరీష్ రావు నివాళులర్పించి మంత్రి ప్రశాంత్ రెడ్డిని వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. హరీష్ రావు వెంట బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.

Next Story