నిజామాబాద్‌లో కేజీఎఫ్ సీన్ రిపీట్.. కార్మికులను నిర్భందించి ఘోరం

by Ajay Maddhiboyina |

నిజామాబాద్ జిల్లాలో కేజీఎఫ్ సీన్ రిపీట్ అయ్యింది. కేజీఎఫ్ సినిమాలో గోల్డ్ మైన్ లో కార్మికుల‌ను బంధించి వెట్టి చాకిరీ చేయించుకుంటూ య‌జ‌మానులు దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తారు. ఇప్పుడు అలాంటి స‌న్నివేశ‌మే నిజామాబాద్ జిల్లాలోనూ చోటు చేసుకుంది.

నిజామాబాద్‌లో కేజీఎఫ్ సీన్ రిపీట్.. కార్మికులను నిర్భందించి ఘోరం
X

దిశ‌, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లాలో కేజీఎఫ్ సీన్ రిపీట్ అయ్యింది. కేజీఎఫ్ సినిమాలో గోల్డ్ మైన్ లో కార్మికుల‌ను బంధించి వెట్టి చాకిరీ చేయించుకుంటూ య‌జ‌మానులు దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తారు. ఇప్పుడు అలాంటి స‌న్నివేశ‌మే నిజామాబాద్ జిల్లాలోనూ చోటు చేసుకుంది. జిల్లాలోని ఆర్మూర్, ఆలూరు మండ‌లాల్లోని దేగం, మ‌గ్గిడి ప్రాంతాల‌లో ఇటుక బ‌ట్టిల‌లో జిల్లా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి భార‌త ల‌క్ష్మి రెస్క్యూ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. ఇటుక‌బ‌ట్టిల‌లో 20 మంది కార్మికుల అనుమ‌తితో వంద‌ల మందితో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న‌ట్టు గుర్తించారు. ఐదేళ్లుగా త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన 474 మంది కార్మికులు ఇటుక బ‌ట్టీల్లోనే మ‌గ్గిపోతున్న‌ట్టు గుర్తించారు.

ఐదేళ్ల‌లో న‌లుగురు కార్మికులు మ‌ర‌ణించిన‌ట్టు బాధితులు వాంగ్మూలం ఇచ్చారు. అంతేకాకుండా మృత‌దేహాలు సైతం మాయం చేశారు అంటూ సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టారు. మృతేదేహాల మాయంపై బాధితుల ఫిర్యాదు మేర‌కు జిల్లా జ‌డ్జి విచార‌ణ‌కు ఆదేశించారు. ఇటుకబట్టిల‌ నిర్వాహకులు తిరుపతి రెడ్డి, కిరణ్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి లపై వివిధ కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పిల్లలను బంధించి, ఫోన్లు, ఆధార్ కార్డులు లాక్కుని బట్టి నుండి బయటకు వెళ్లకుండా కార్మికులపై నిఘా పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇటుక‌బ‌ట్టిల్లో క‌సీస సౌక‌ర్యాలు లేక‌పోవ‌డంపై కూడా తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనిపై జిల్లా జ‌డ్జి స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించ‌గా రాష్ట్ర‌వ్యాప్తంగా ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశమ‌వుతోంది.

Next Story