ముస్లిం సోదరులకు సీపీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు

by Nallavelli.Anjaneyulu |

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ వరిధిలోని ముస్లిం సోదరులందరికీ ఈనెల 21 న జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ తరఫున, వ్యక్తి గతంగా త‌న తరఫున హార్థిక శుభాకాంక్షలు తెలిపారు పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య‌.

ముస్లిం సోదరులకు సీపీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ వరిధిలోని ముస్లిం సోదరులందరికీ ఈనెల 21 న జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ తరఫున, వ్యక్తి గతంగా త‌న తరఫున హార్థిక శుభాకాంక్షలు తెలిపారు పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య‌. ఎల్లప్పుడు ప్రజలు, పోలీస్ సిబ్బంది స్నేహ పూర్వకంగా, సోదరభావంతో మెలగాలని ఆయన ఆకాంక్షించారు. అందరూ వారి కుటుంబసభ్యులతో , సుఖ, సంతోషములతో వర్ధిల్లి సమాజంలో శాంతి స్థాపనకు అందరూ కృషి చేయాలని సీపీ సాయిచైతన్య కోరుకున్నారు.

మోపాల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సీపీ

నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ సాయిచైతన్య ముగ్పాల్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ సీపీ పి. సాయి చైతన్య మోపాల్ పోలీస్ స్టేషన్‌ ను సందర్శించి స్టేషన్ సిబ్బంది పనితీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌ లోని రికార్డుల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారం, భద్రతా చర్యలతో పాటు సిబ్బంది పనితీరును కూడా సమీక్షించారు. ప్రజలతో చక్కని సంబంధాలు నెరపాల్సిన అవసరముందని సిబ్బందికి సూచించారు. ప్రజలతో మరింత స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కూడా సూచించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి, భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహిస్తూ, ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా పని చేయాలని సీపీ సాయిచైతన్య ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీస్ శాఖ పనితీరును మెరుగుపరచడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు సంబంధించిన బొలెరో వాహనం, పెట్రోలింగ్ వాహనాల పనితీరును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పెట్రోలింగ్ వాహనంలో ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిడ్ కిట్ సామాగ్రిని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత సిబ్బందికి వాహనానికి సంబంధించిన కండీషన్ గురించి ప్రశ్నించారు. ఎల్లవేళలా వాహనం కండీషన్ లో ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిజామాబాద్ సౌత్ రూరల్ ఇన్స్పెక్టర్ ఎన్. సురేష్ కుమార్, ఎస్సై జెడ్. సుస్మిత, పోలీస్ స్టేషన్ ల సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ కానిస్టేబుల్ కొడుకును అభినందించిన సీపీ

బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ (హోమియోపతి) శిక్షణ పూర్తి చేసిన సందర్భంగా సీసీఎస్ పోలీస్ స్టషన్ తో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బి.రవికృష్ణ కుమారుడు బి.రజనీకాంత్ బీహెచ్ఎంఎస్ (హోమియోపతి) శిక్షణ పూర్తి చేసిన సందర్భంగా నిజామాబాద్ సీపీ సాయిచైతన్య ను శుక్రవారం సీపీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగుల పిల్లలు ఉన్నత చదువులు చదివి, సమాజానికి ఉపయోగపడే వృత్తుల్లో స్థిరపడటం గర్వకారణమన్నారు. పోలీస్ కమీషనర్ పేర్కొన్నారు. కష్టపడి చదివి డాక్టరుగా ఎదిగిన రజనీకాంత్ ను ఆదర్శంగా తీసుకోవాలని , పోలీస్ సిబ్బంది పిల్లల చదువులకు తమ శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందని సీపీ సాయిచైతన్య భరోసా ఇచ్చారు.

ఇఫ్తార్ విందులో పాల్గొన్న పోలీస్ కమిషనర్

టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హతాయి గల్లీలోని మజీద్ ఏ ఇస్లామియా మసీద్ లో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో నిజామాబాద్ సీపీ సాయిచైతన్య పాల్గొన్నారు. కమిటీ నిర్వహించిన దువాలో సీపీ పాల్గొని, ముస్లీం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కె. ఉమారాణి, టౌన్ ఏసీపీ ప్రకాష్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, టౌన్ సిఐ శ్రీనివాస్ రాజ్, ట్రాఫిక్ సి. ఐ ప్రసాద్ టూ టౌన్ ఎస్ఐ సయ్యద్ ముజాహిద్, మజీద్ అధ్యక్షులు మెహర్ అలీ ఖాన్ పాల్గొన్నారు.

Next Story