- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోటార్మూర్ లో హనుమాన్ ఆలయ వార్షికోత్సవ వేడుకలు
ఆర్మూర్ మున్సిపల్ పరిధి కొటార్ మూర్ ఏరియాలోని మున్సిపల్ 5వ వార్డులో శివ పంచయాతన సహిత హనుమాన్ ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవోపేతంగా జరిగాయి.

దిశ ,ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధి కొటార్ మూర్ ఏరియాలోని మున్సిపల్ 5వ వార్డులో శివ పంచయాతన సహిత హనుమాన్ ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవోపేతంగా జరిగాయి. ఆది,సోమవారాల్లో హనుమాన్ ఆలయ పరిసరాల్లో కుంకుమార్చన, యజ్ఞ కార్యక్రమాలు వేద పండితులు రాజు సమక్షంలో.. వేదమంత్రోచ్ఛరణల మధ్య విశేష పూజలు జరిగాయి. హనుమాన్ ఆలయ పరిసరాల్లో గ్రామంలోని మహిళామణులు ఎంతో భక్తపార్వశ్యంతో చేసిన కుంకుమార్చనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ఆలయ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి హాజరై హనుమాన్ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం వీడీసీ కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖులు వినయ్ కుమార్ రెడ్డిని పట్టు శాలువాతో ఘనంగా సన్మానించారు. గ్రామంలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయించాలని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు వినయ్ కుమార్ రెడ్డిని కోరారు. తర్వాత ప్రక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల విన్నపం మేరకు వినయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. పాఠశాల అభివృద్ధికి, గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తానని వినయ్ రెడ్డి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. తరువాత హనుమాన్ పరిసరాల్లో వీడీసీ ఆధ్వర్యంలో.. జరిగిన అన్నప్రసాద వితరణలో వినయ్ రెడ్డి, ఆలయ అన్నదాన సేవకులతో కలిసి భక్తులకు వడ్డన చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు బండారి శాల ప్రసాద్, ప్రొద్దుటూరు మురళీధర్ రెడ్డి (రాజు), ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మామిడి చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.కె. చిన్నారెడ్డి,కాంగ్రెస్ నాయకులు ఎన్.వి. రవీందర్ రెడ్డి (చిట్టి), గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు డిష్ గంగాధర్, కోశాధికారి మామిడి ఏలియా రెడ్డి, కార్యదర్శి నాగుల శ్రీధర్ గౌడ్, వీడీసీ సభ్యులు, కోటార్ మూర్ వాసులు పాల్గొన్నారు.






