- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వడగళ్ల వాన బాధితులను ఆదుకోవాలి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఎల్లారెడ్డి నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.

దిశ, తాడ్వాయి : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఎల్లారెడ్డి నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న కీలకమైన వంతెనల నిర్మాణం దెబ్బతిన్న ప్రభుత్వ కార్యాలయాల మరమ్మత్తుల కోసం తక్షణమే నిధులు విడుదల చేయాలని ఆయన కోరారు. గతంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా లింగంపల్లి ఖుర్ద్, ఆడివిలింగాల్ వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ వంతెనలు నాగిరెడ్డిపేట, లింగంపేట్ ఎల్లారెడ్డి మండలాల మధ్య ప్రధాన రవాణా మార్గాలుగా ఉన్నాయని, ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను తరలించడానికి ఈ మార్గాలపైనే ఆధారపడతారని వివరించారు.
ఈ వంతెనలు సరిగ్గా లేకపోవడం వల్ల వేలాది మంది రైతులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభ దృష్టికి తెచ్చారు.సదాశివనగర్, గాంధారి, రాజంపేట, తాడ్వాయి, రామారెడ్డి మండలాల్లోని పాత వంతెనలు మరమ్మత్తులకు నోచుకోక ప్రమాదకరంగా మారాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్, ఆర్ ఎండ్ బీ శాఖల సమన్వయంతో వీటికి తక్షణమే నిధులు మంజూరు చేసి, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న వంతెనల నిర్మాణానికి, ప్రభుత్వ భవనాల ఆధునీకరణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించి త్వరగా నిధులు విడుదల చేయాలని కోరారు.






