ఎర్ర జొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

by Ratna Kumari |

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని ఎర్ర జొన్న‌ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని, ఎర్రజొన్న విత్తన వ్యాపారులు, దళారులు కలిసి రైతుల నడ్డి విరుస్తుండని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.

ఎర్ర జొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి : ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలోని ఎర్ర జొన్న‌ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని, ఎర్రజొన్న విత్తన వ్యాపారులు, దళారులు కలిసి రైతుల నడ్డి విరుస్తుండని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం జీరో హ‌వ‌ర్ లో భాగంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. ఎర్ర జొన్న రైతు పంట దిగుబడులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఎర్ర జొన్న రైతులకు ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. రైతుల ఎర్రజొన్న పంటను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయడం పెద్ద విషయం కాదని, కేవలం నిజామాబాద్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలతో పాటు ఇతర జిల్లాలైన నిర్మల్ జగిత్యాల జిల్లాల ప్రాంతాల్లో ఎర్రజొన్న పంట సాగు అవుతుందన్నారు.


గత ఏడాది 3800 ఉన్న ఎర్ర జొన్న ధర ప్రస్తుతం 3200 వ్యాపారుల సిండికేట్ తో రైతులను మోసానికి గురి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఆలోచించి ఎర్ర జొన్న రైతులను ఆదుకోవాలని రైతుల కోసం ప్రభుత్వమే ఎర్రజొన్న పంట దిగుబడులను కొనుగోలు చేయాలని పైడి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. గతంలో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఆర్మూర్ ప్రాంతంలో ఎర్రజొన్న విషయంలో కాల్పులు జరిగిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. మళ్లీ ఆ పరిస్థితి రాకుండా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల బాధలు తీర్చేందుకు ప్రభుత్వమే ఎర్రజొన్న పంటలను కొనుగోలు చేయాలన్నారు.

Next Story