ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల క్యాంప‌స్ ప‌నులు మార్చి వ‌ర‌కు పూర్తి చేయాలి : క‌లెక్ట‌ర్ ఆశిష్ సాంగ్వాన్

by Ratna Kumari |   (  Updated:2025-11-12 12:07:44  IST  )

దిశ‌, కామారెడ్డి టౌన్ : ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల క్యాంప‌స్ ప‌నులు మార్చ్ వ‌ర‌కు పూర్తి చేయాలని క‌లెక్ట‌ర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. నూత‌నంగా నిర్మిస్తున్న ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల క్యాంప‌స్ ను

ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల క్యాంప‌స్ ప‌నులు మార్చి వ‌ర‌కు పూర్తి చేయాలి : క‌లెక్ట‌ర్ ఆశిష్ సాంగ్వాన్
X

దిశ‌, కామారెడ్డి టౌన్ : ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల క్యాంప‌స్ ప‌నులు మార్చ్ వ‌ర‌కు పూర్తి చేయాలని క‌లెక్ట‌ర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. నూత‌నంగా నిర్మిస్తున్న ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల క్యాంప‌స్ ను బుధ‌వారం సంద‌ర్శించారు. నిర్మాణ ప‌నులు వేగ‌వంతంగా పూర్తి చేయాల‌ని సూచించారు. నిర్మాణం లో ఉన్న మెడికల్ కాలేజి మొత్తం కలియ తిరుగుతూ ప్రధాన కళాశాల భవనం, బాలికల హాస్టల్, బాలుర హాస్టల్, డైనింగ్ హాల్ భవనాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిపై, వైద్య కళాశాలకు కావాల్సిన మంచి నీటి వసతి గురించి మిషన్ భగీరథ , మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్ అండ్ బి ఈ ఈ మోహన్ మునిసిపల్ కమిషనర్ కామారెడ్డి, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అధికారులు పాల్గొన్నారు.

Next Story