- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రకృతి విపత్తు పై రాజకీయం చేయడం సిగ్గుచేటు : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
దిశ, కామారెడ్డి : ప్రకృతి వైపరిత్యం పై బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలు చేయడం సిగ్గు చేటని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. జిల్లాలో హరీష్ రావు

దిశ, కామారెడ్డి : ప్రకృతి వైపరిత్యం పై బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలు చేయడం సిగ్గు చేటని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. జిల్లాలో హరీష్ రావు పర్యటన పై ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రజలు కాకావికాలం చెందుతే వారిని పరామర్శించడానికి మీకు నెలరోజుల తర్వాత తీరిందా, లేదా స్థానిక ఎన్నికల లబ్ధి కోసమా..? అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో వర్షాలు, వడగళ్ల వాన వల్ల ఎన్నోసార్లు పంట నష్టం జరిగినా ఏ ఒక్కసారి కూడా రైతులను ఆదుకోలేదన్నారు. ఇక్కడి ప్రజలపై ప్రేమతో హరీష్ రావు రాలేదని.. స్థానిక ఎన్నికల్లో పరువు కాపాడుకోవడానికి పర్యటన చేశారన్నారు. ఆయన కుటుంబ సమస్యల నుంచి తేరుకొని బాధితులను పరామర్శించడానికి నెల రోజులు పట్టిందన్నారు. ప్రజల నివాసాలు నీళ్లతో కొట్టుకు పోయి హహకారాలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎటుపోయారని ప్రశ్నించారు.
వర్షాల్లో ప్రమాదమని తెలిసి కూడా సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో ముంపు ప్రాంతాలు చూడడానికి వచ్చారన్నారు. వాతావరణం అనుకూలించక ప్రజలను పరామర్శించలేకపోయారన్నారు. తిరిగి రెండు రోజుల్లో వచ్చి నష్టపోయిన రైతులతో మాట్లాడి వారిని పరామర్శించి వారి కుటుంబాలకు తక్షణ సహాయం కింద 11 వేల రూపాయల చొప్పున, చనిపోయిన వారి కుటుంబాలకు నాలుగు లక్షలు అందించారన్నారు. నాలుగు గంటల్లో రోడ్లను మరమ్మతు చేసి రాకపోకలను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ నిర్వహించి అధికారులను సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారన్నారు. వారు ఇచ్చిన నివేదికను కేంద్రానికి పంపించారని, రాష్ట్ర ప్రభుత్వం నుండి చేయాల్సిందంతా చేస్తున్నారని, కేంద్రం నుండి ఇప్పటివరకు ఎలాంటి సహాయం అందలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోయే రోజులు వచ్చాయని, వారి హయాంలో దోపిడి తప్ప రైతులకు, ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. రుణమాఫీ చేయలేదు, రేషన్ కార్డులు ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఉద్యోగులకు జీతాలు సరిగ్గా ఇవ్వలేదన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు.






