రాష్ట్రస్థాయి క్రీడలకు గోపాల్ పేట్ విద్యార్థుల ఎంపిక

by Nallavelli.Anjaneyulu |

దిశ, నాగిరెడ్డిపేట్ : మండల కేంద్రంలోని గోపాల్ పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్ధులు మూడు రోజుల పాటు జరిగే రాష్ట్రస్థాయి నెట్ బాల్ క్రీడా పోటీలకు ఎంపికైనట్టు

రాష్ట్రస్థాయి క్రీడలకు గోపాల్ పేట్ విద్యార్థుల ఎంపిక
X

దిశ, నాగిరెడ్డిపేట్ : మండల కేంద్రంలోని గోపాల్ పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్ధులు మూడు రోజుల పాటు జరిగే రాష్ట్రస్థాయి నెట్ బాల్ క్రీడా పోటీలకు ఎంపికైనట్టు పాఠశాల క్రీడా ఉపాధ్యాయుడు సబాత్ కృష్ణ తెలిపారు. బుధవారం కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండల కేంద్రంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో గోపాల్ పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అర్చన, నందిని, సాకేత్, మనోహర్ అనే విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచడంతో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ లో శుక్రవారం నుండి ఆదివారం వరకు మూడు రోజుల పాటు జరిగే నెట్ బాల్ క్రీడాపోటీలకు గోపాల్ పేట్ ఉన్నత పాఠశాల నుండి వెళ్లినట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్ రామిరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.

Next Story