ఆర్టీసీ బస్సులో బంగారు నగలు చోరీ

by Ratna Kumari |

ప్రయాణికురాలి బ్యాగులో దాచి ఉంచిన బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన కామారెడ్డి జిల్లా భి క్కనూరు మండలం జంగంపల్లి వద్ద బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సులో చోటు చేసుకుంది.

ఆర్టీసీ బస్సులో బంగారు నగలు చోరీ
X

దిశ, భిక్కనూరు : ప్రయాణికురాలి బ్యాగులో దాచి ఉంచిన బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన ఘటన కామారెడ్డి జిల్లా భి క్కనూరు మండలం జంగంపల్లి వద్ద బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని కి చెందిన మంజుల తన తల్లిగారి ఊరైన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ వెళ్లేందుకు కామారెడ్డికి చేరుకుంది. అక్కడి నుంచి రామయంపేటకు వెళ్లే కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన లోకల్ బస్సు ఎక్కి కూర్చుంది. తన చేతిలో ఉన్న బ్యాగును సామాన్లు పెట్టే స్టాండ్ పై పెట్టి భద్రంగా చూసుకుంటూ వస్తుంది. అయితే బస్సు ఫుల్ ప్రయాణికులతో నిండిపోయి డిపో నుంచి బయలుదేరింది. బస్సు జంగంపల్లి వద్దకు రాగానే జిప్ కరెక్ట్ గానే ఉందా లేదా అని చూసుకునేందుకు బ్యాగు కిందికి తీసుకొని చూసింది. బ్యాగులో దాచి ఉంచిన మూడు తులాల విలువచేసే నెక్లెస్ తో పాటు, కమ్మలు పెట్టి ఉన్న బాక్స్ కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది. వెంటనే లబోదిబో మనడంతో బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు ఏం జరిగిందంటూ బాధితురాలు ప్రశ్నించగా, ఆమె బంగారు నగలు పోయాయంటూ కన్నీరు మున్నీరయింది. తోటి ప్రయాణికులను ఈ విషయమై ఎవరిని అడిగినా, మా కంటే మాకు తెలియదంటూ సమాధానం చెప్పడమే కాకుండా కావాలంటే మా బ్యాగులు చెక్ చేసుకోమన్నారు. దీంతో బాధితురాలు ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్ల వద్దకు వెళ్లి, బస్సును పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాలని వేడుకొంది. ఈ మేరకు ఆర్టీసీ లోకల్ బస్సును భిక్కనూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆపాడు. ఈ విషయం పోలీసులకు చెప్పడంతో వెంటనే పోలీసులు బస్సు ఎక్కి బస్సులో ఉన్న ప్రయాణికులు అందర్నీ తనిఖీ చేసినప్పటికీ చోరీకి గురైన నగలు మాత్రం ఎవరి వద్ద వెతికినా ఫలితం లేకుండా పోయింది. బస్టాండ్ లో బస్సు ఎక్కే సమయంలో పోయిందా..? లేక అంతకుముందే పోయిందా అన్నది బాధితురాలికి కరెక్టుగా గుర్తుకు రాకపోవడంతో, తిరిగి కామారెడ్డి వెళ్లి అక్కడ కంప్లైంట్ చేస్తానని ఆ మ‌హిళా తెలిపింది.

Next Story