- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇవాల్సిన బెనిఫిట్స్ ఇవ్వండి
అంగన్ వాడీలకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుంటే బస్టాండ్ లో అడుక్కుతినే పరిస్థితి వస్తుందని అంగన్ వాడీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇవాల్సిన బెనిఫిట్స్ ఇవ్వండి
-ప్రభుత్వాన్ని కోరిన అంగన్ వాడీలు
-ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటి ముట్టడి
దిశ, కామారెడ్డి : అంగన్ వాడీలకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుంటే బస్టాండ్ లో అడుక్కుతినే పరిస్థితి వస్తుందని అంగన్ వాడీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నలభై ఏళ్ల సర్వీసు పెట్టుకుని బస్టాండులో అడుక్కు తినే పరిస్థితి దాపురించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు సోమవారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటిని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షబ్బీర్ అలీ రావాలని డిమాండ్ చేశారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి అంగన్ వాడీలతో మాట్లాడుతూ... షబ్బీర్ అలీ స్థానికంగా అందుబాటులో లేరని, మంగళవారం కొంతమంది తనతో వస్తే తీసుకెళ్లి కలిపిస్తానన్నారు. అంగన్ వాడీల జిల్లా ప్రధాన కార్యదర్శి బాబాయమ్మ మాట్లాడుతూ.. పిఎంసీలు ప్రి ప్రైమరీ స్కూల్స్ ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలిసి మూడు నెలల నుంచే మంత్రి సీతక్క, కమిషనర్, డైరెక్టర్లకు తామే వాటిని నిర్వహిస్తామని వినతిపత్రాలు అందజేసామన్నారు. అయినా కలెక్టర్లకు అదేశాలివ్వడంతో ఈ నెల 10 న ప్రారంభించారని తెలిపారు. దాంతో అంగన్వాడీల్లో పిల్లల సంఖ్య తగిందన్నారు. ఫేస్ రికగ్నేషన్ ద్వారా లబ్ధిదారుల ముఖాలు సరిగా రావడం లేదని, ఆ విధానం తీసెయ్యాలన్నారు. తమకు ఇచ్చిన 5జీ ఫోన్లు పని చేయడం లేదని, ఫోన్లో రెండు యాప్స్ డౌన్ లోడ్ చేయడం తమవల్ల కావడం లేదని, ఒకే యాప్ నిర్ణయించాలని కోరారు. 2024 లో దాదాపు 10 వేల మంది టీచర్లు, ఆయాలు రిటైర్మెంట్ అయ్యారని, వారికి ఇప్పటికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదన్నారు. వారికి ఆసరా పింఛన్ ఇస్తామని ఇవ్వలేదని తెలిపారు. ఇలా ఏది ఇవ్వకుండా పోతే తాము బస్టాండులో అడుక్కు తినాలా? అని ప్రశ్నించారు. సంగారెడ్డి బస్టాండులో ఓ టీచర్, ఆయా డబ్బులు లేక అడుక్కున్న విషయాన్ని గుర్తు చేసుకుని ఆవేదన చెందారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.18 వేల జీతం ఇస్తామని చెప్పి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికి అతిగతి లేదని తెలిపారు. తమ సమస్యలు పట్టించుకోవడం లేదని, ఇచ్చిన వినతిపత్రాలు తుంగలో తొక్కుతున్నారని వాపోయారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 25 న చలో సెక్రెటరీయేట్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీలు పాల్గొన్నారు.






