- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమాయకుల వద్ద అధిక వడ్డీ వసూలు చేసే ముఠా సభ్యులు అరెస్ట్
సాధారణ ప్రజలు, రైతులు, ఆటో డ్రైవర్ల అవసరాలను ఆసరాగా చేసుకుని ఫైనాన్స్ ఇప్పిస్తామని నమ్మబలికి అధిక వడ్డీ వసూలు చేస్తున్న ముఠా లోని ఇద్దరు సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

దిశ, కామారెడ్డి : సాధారణ ప్రజలు, రైతులు, ఆటో డ్రైవర్ల అవసరాలను ఆసరాగా చేసుకుని ఫైనాన్స్ ఇప్పిస్తామని నమ్మబలికి అధిక వడ్డీ వసూలు చేస్తున్న ముఠా లోని ఇద్దరు సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పక్కా సమాచారం మేరకు కామారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద మాటు వేసి పట్టుకున్నట్లు తెలిపారు. పోలీసులకు పట్టుబడిన వారిలో సత్తి సాయిరాం, రాజులు ఉండగా వారి వద్ద నుంచి వందలాది ప్రామిసరీ నోట్స్, ఖాళీ చెక్కులు, వేలిముద్రలు తీసుకున్న పత్రాలు, బంగారం, నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పట్టుబడిన వారు కామారెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి, రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో సైతం ఇలాంటి వ్యాపారం చేస్తున్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. ఎవరైనా బాధితులు ఉంటే భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.






