బోరుమోటార్ వద్ద కరెంట్ షాక్.. యువకుడిని కాపాడిన పోలీసులు

by Bhanu |

గాంధారి మండల కేంద్రంలోని సాయిలు టీ పాయింట్ పక్కన ఉన్న బోరుమోటార్ వద్ద నీరు త్రాగడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై గాయపడిన ఘటన చోటు చేసుకుంది.

బోరుమోటార్ వద్ద కరెంట్ షాక్.. యువకుడిని కాపాడిన పోలీసులు
X

దిశ , గాంధారి : గాంధారి మండల కేంద్రంలోని సాయిలు టీ పాయింట్ పక్కన ఉన్న బోరుమోటార్ వద్ద నీరు త్రాగడానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై గాయపడిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, పర్మల్ల తండాకు చెందిన మలావత్ సక్రం అనే వ్యక్తి బోరుమోటార్ వద్ద నీరు త్రాగేందుకు వెళ్లగా, అకస్మాత్తుగా కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయాడు. అక్కడి స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో, గాంధారి ఎస్ఐ ఆంజనేయులు స్పందించి బ్లూ కోర్టు విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు కిషన్ గౌడ్, సందీప్ లను అక్కడికి పంపించారు.

అందరు సమయస్ఫూర్తితో స్పందించి, మలావత్ సక్రంను ఆటో ద్వారా గాంధారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆపై మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో చూపిన వేగవంతమైన చర్యల్ని మెచ్చిన సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, బ్లూ కోర్టు కానిస్టేబుళ్లను ప్రత్యేకంగా అభినందించారు.


Next Story