కామారెడ్డి ప్రజలను కేసీఆర్ పరామర్శించకపోవడం సిగ్గుచేటు

by velandi.Saikiran |

కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్ కనీసం ప్రజలను పరామర్శించకపోవడం సిగ్గుచేటు అని ఆగ్ర‌హించారు టిపిసిసి

కామారెడ్డి ప్రజలను కేసీఆర్ పరామర్శించకపోవడం సిగ్గుచేటు
X

దిశ, రాజంపేట: కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్ కనీసం ప్రజలను పరామర్శించకపోవడం సిగ్గుచేటు అని ఆగ్ర‌హించారు టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సంభవించిన వరదల వల్ల నష్టపోయిన రాజంపేట మండలంలోని గుండారం, ఎల్లాపూర్ తండ, నడిం తండా, పలుగుట్ట తండాలలో ఆదివారం పర్యటించారు మధుయాష్కి గౌడ్. శేషాద్రి ఇండస్ట్రీ సహకారంతో వరద బాధిత తండాల ప్రజలకు బట్టలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం అందించేలా కృషి చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల బాధిత ప్రాంతాలను సందర్శించి నష్టపరిహారం అందించే విషయంపై ఇప్పటికే చర్యలు ప్రారంభించారని తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు.

బట్టలను పంపిణీ చేసిన శేషాద్రి ఇండస్ట్రీస్ ప్రతినిధులను ఆయన అభినందించారు.కామారెడ్డి నియోజకవర్గంలో వరదలు వచ్చి ప్రజాజీవనం అల్లకల్లోలం అయినప్పటికీ.. పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్, కామారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ కనీసం ప్రజలను పరామర్శించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు ఆకుల శ్రీనివాస్, లింగాగౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రణీత్ రెడ్డి, నాయకులు సంపత్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సల్మాన్, మదన్ లాల్ తదితరులు పాల్గొన్నారు.

Next Story