ముగ్గురిపై దాడి చేసిన ఐదుగురు అరెస్ట్

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-07 17:10:10  IST  )

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని పెర్కిట్ లో ఓ హోటల్ యజమాని అతని దుకాణంలో పనిచేసే వ్యక్తులపై మొత్తం ముగ్గురు వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఐదుగురు నిందితులపై కేసు

ముగ్గురిపై దాడి చేసిన ఐదుగురు అరెస్ట్
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని పెర్కిట్ లో ఓ హోటల్ యజమాని అతని దుకాణంలో పనిచేసే వ్యక్తులపై మొత్తం ముగ్గురు వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ శుక్రవారం తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ వెల్ల‌డించారు. ఈనెల 05న బుధవారం రాత్రి టీ రాగడం కోసం పెర్కిట్ చౌరస్తాలో ఇండియన్ టీ హోటల్ కు ఇబ్రహీం ఆయన అనుచరులు వచ్చి టీ కావాలని హోటల్ యజమాని సద్దాం ను అడిగారు. రాత్రి కావడంతో హోటల్ మూసే సమయం అయినందున టి ఇవ్వలేనని సద్దాం వారితో చెప్పాడు.దీంతో ఇబ్రహీం హోటల్ పక్కనే కావాలని మూత్ర విసర్జన చేసి కావాలనే సద్దాం తో గొడవకు దిగాడు. ఇబ్రహీం తన వెంట వచ్చిన అనుచరులతో కలిసి సద్దాం ఆయన దుకాణంలో పనిచేస్తున్న మరో ఇద్దరు వ్యక్తులపై కర్రలు,రాడ్లతో దాడి చేయడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.బాధితుడు ఇండియన్ హోటల్ యజమాని సద్దాం ఫిర్యాదు మేరకు నేరస్తులపై కేసు నమోదు చేసి ఐదుగురు నిందితులను రిమాండ్ కు తరలించినట్టు ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

Next Story