కొనుగోలు కేంద్రంలో అగ్ని ప్రమాదం

by Nallavelli.Anjaneyulu |

దిశ, నాగిరెడ్డిపేట్ : మండలంలోని పోచారం గ్రామంలో గ్రామ మహిళా సంఘం ద్వారా నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంబవించిందని ఐకెపి ఎపిఎం రామనారాయణ గౌడ్ తెలిపారు.

కొనుగోలు కేంద్రంలో అగ్ని ప్రమాదం
X

దిశ, నాగిరెడ్డిపేట్ : మండలంలోని పోచారం గ్రామంలో గ్రామ మహిళా సంఘం ద్వారా నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంబవించిందని ఐకెపి ఎపిఎం రామనారాయణ గౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉనాయి. పోచారం పరిధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి సుమారు 3 వేల 500 ల కొత్త ఖాళీ గన్ని బస్తాలతో పాటు, 4 టార్పాలిన్ కవర్లు దద్దమైనట్లు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు మూడు లక్షల రూపాయల వరకు నష్టం సంభవించినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో గ్రామ సంఘం అధ్యక్షురాలు పి. లక్ష్మి పిర్యాదు చేసినట్లు తెలిపారు.

Next Story