క‌న్న కూతురి పై అత్యాచారం చేసిన తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష

by Ratna Kumari |

దిశ‌, కామారెడ్డి : క‌న్న‌కూతురి పై అత్యాచారం చేసిన తండ్రికి ఏడేళ్ల క‌ఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి వ‌ర‌ప్ర‌సాద్ తీర్చు ఇచ్చిన‌ట్టు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జైలు

క‌న్న కూతురి పై అత్యాచారం చేసిన తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష
X

దిశ‌, కామారెడ్డి : క‌న్న‌కూతురి పై అత్యాచారం చేసిన తండ్రికి ఏడేళ్ల క‌ఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి వ‌ర‌ప్ర‌సాద్ తీర్చు ఇచ్చిన‌ట్టు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జైలు శిక్ష‌తో పాటు 30వేల జ‌రిమానా విధించారు. బాన్సువాడ ట్రైబ‌ల్ వెల్పేర్ గురుకుల‌పాఠ‌శాల విద్యార్థులు జ‌న‌వ‌రి నెల‌లో సంక్రాంతి సెల‌వుల‌కు ఇంటికి వెళ్లారు. జ‌న‌వ‌రి 18న అంద‌రూ హాస్ట‌ల్ కి చేరుకున్నారు. కానీ ఓ విద్యార్థిని మూడు రోజులు ఆల‌స్యంగా హాజ‌రైంది. దీంతో ఆ విద్యార్థిని మెడిక‌ల్ చెక‌ప్ కోసం హాస్పిట‌ల్ కి పంపించ‌మ‌ని ఆ విద్యార్థిని బాబాయి కోరాడు. హాస్ట‌ల్ ప్రిన్సిపాల్ సూర్య‌దేవ‌ర విజ‌య భార‌తి.. విద్యార్థిని క్లాస్ టీచ‌ర్ క‌లిసి ఏమైంద‌ని ఆరా తీశారు.

సంక్రాంతి సెలవుల‌కు ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో తన తండ్రి బలవంతంగా తనపై లైంగికంగా అనుచితంగా ప్రవర్తించాడని తెలిపింది. వెంటనే బాన్సువాడ ప్రదానోపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో విద్యార్థిని తండ్రిని నేరస్తునిగా గుర్తించి పొక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. విచార‌ణ త‌రువాత పోలీసులు కోర్టులో సాక్షాధారాలు సమర్పించారు. సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి వర ప్రసాద్ నిందితుడికి ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ తాజాగా తీర్పు ఇచ్చారు.

Next Story