- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోరుట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ కారు ఢీ
దిశ, ఆర్మూర్ : జగిత్యాల జిల్లాలో కోరుట్ల- మెట్ పల్లి ప్రాంతాల మధ్య శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాద

దిశ, ఆర్మూర్ : జగిత్యాల జిల్లాలో కోరుట్ల- మెట్ పల్లి ప్రాంతాల మధ్య శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాద సంఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన కోటగిరి మోహన్ - కోటగిరి లావణ్య దంపతులు వారి కుమార్తె కోటగిరి కీర్తితో కలిసి జగిత్యాల జిల్లాలోని శుభకార్యానికి వెళ్లి తిరిగి ఆర్మూర్ కు వస్తుండగా కోరుట్ల లోని మారుతి నగర్ వద్ద ఓ లారీ షిఫ్ట్ కార్ ఢీకొన్నాయి. మంథని గ్రామానికి చెందిన కోటగిరి మోహన్ దంపతులు వారి కుమార్తెతో కీర్తి తో కలిసి జగిత్యాల జిల్లాలోని శుభకార్యానికి వారి స్వంత షిఫ్ట్ కారులో వెళ్లారు. తిరిగి ఆర్మూర్ కు వస్తుండగా కోరుట్ల ప్రాంతంలోని మారుతీ నగర్ లో ఈ షిఫ్ట్ కార్ ఓ లారీని ఢీకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో మంథని గ్రామానికి చెందిన కోటగిరి మోహన్ (43), కోటగిరి లావణ్య (40) దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వారి కుమార్తె కోటగిరి కీర్తన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైంది.
దీంతో ఆ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కోటగిరి కీర్తనను కోరుట్ల ప్రాంతం నుండి ఆర్మూర్ లోని ఆశ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి వైద్యం చేయించేందుకు తరలించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఆ దంపతులకు కూతురు కీర్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కోటగిరి మోహన్ నందిపేట మండల కేంద్రంలో ఇంజనీరింగ్ షాప్ నిర్వహించి ఇటీవల షాప్ నిర్వహణ భారంగా మారడంతో మానేశారు. అతని భార్య మృతురాలు కోటగిరి లావణ్య బీడీ కార్మికురాలుగా పనిచేస్తుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దంపతులు మృతి చెందడంతో పదవ తరగతి చదువుకునే కోటగిరి కీర్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది.15 సంవత్సరాల వయసు గల కీర్తి శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే సంఘటనలో ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోవడంతో అనాధగా మారనుంది. చిన్నారి పాప తల్లిదండ్రులు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో మంథని గ్రామంలో శనివారం రాత్రి విషాద ఛాయలు అలుముకున్నాయి. జగిత్యాల జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్టు దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా మంథని గ్రామానికి చెందిన కోటగిరి మోహన్ లావణ్య దంపతులు ఏడు అడుగులే కాదు.. అనంత లోకాలకు సైతం కలిసే ప్రయాణం చేసి మృత్యు లోగిళ్ళలో పడుకున్నారు.






