- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంకాపూర్ రైతుల సాగు పద్ధతులు అద్భుతం... అనుసరణీయం...
by Ratna Kumari |
దిశ, ఆర్మూర్ : అంకాపూర్ లో రైతుల పంటల సాగు పద్ధతులు అద్భుతంగా ఉన్నాయని, పంటల సాగు విధానాలు ఇతర రైతులకు అనుసరణీయంగా బాగున్నాయని పొలాస వ్యవసాయ

X
దిశ, ఆర్మూర్ : అంకాపూర్ లో రైతుల పంటల సాగు పద్ధతులు అద్భుతంగా ఉన్నాయని, పంటల సాగు విధానాలు ఇతర రైతులకు అనుసరణీయంగా బాగున్నాయని పొలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు, శాస్త్రవేత్తలు అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లాలోని పొలాస వ్యవసాయ కళాశాల నుండి విద్యార్థులు, శాస్త్రవేత్తలు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామాన్ని సందర్శించారు. అంకాపూర్ గ్రామంలో రైతులు సాగు చేస్తున్న పంటలను, సాగు పద్ధతులను, కలుపు మొక్కల నివారణ పద్ధతులను తెలుసుకున్నారు. అనంతరం విత్తనాభివృద్ధి సందర్శించి అక్కడ పరిస్థితిని గమనించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అంకాపూర్ గురడి రెడ్డి సంఘం చైర్మన్ కే. నర్సారెడ్డి,మాజీ కార్యదర్శి కేకే. బాజన్న, పోలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు, శాస్త్రవేత్తలు రమేష్, జయంత్, శ్రావణ్, శ్రీకాంత్, రంజిత్ పాల్గొన్నారు.
Next Story






