వ‌రిధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీల కోసం రైతుల ఎదురుచూపులు

by Nallavelli.Anjaneyulu |

దిశ, నాగిరెడ్డిపేట్ : మండలంలోని మాసానిపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేసి ఐదు రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని అధికారులు రైస్ మిల్లుకు

వ‌రిధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీల కోసం రైతుల ఎదురుచూపులు
X

దిశ, నాగిరెడ్డిపేట్ : మండలంలోని మాసానిపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేసి ఐదు రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని అధికారులు రైస్ మిల్లుకు తరలించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మాసానిపల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గ్రామానికి చెందిన పలువురు రైతులకు చెందిన సుమారు 12 వందల బస్తాలను తూకం వేసి లారీలో రైస్ మిల్ కు తరలించారు. కాగా వినోద్, మహేందర్ రెడ్డి అనే రైతులకు చెందిన ధాన్యం బస్తాలను తూకం వేసి నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ రైస్ మిల్లుకు తరలించకపోవడంతో నాలుగు రోజులుగా చల్లటి చలిలో ధాన్యం బస్తాలను కాపలా కాస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేస్తున్న ఐకెపి అధికారులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పక్కనే ఉన్న మాటూరు గ్రామం నుండి దానిని బస్తాలను లారీలలో తరలిస్తున్నప్పటికీ మాసానిపల్లి గ్రామంలో నుండి మాత్రం ధాన్యం బస్తాలను తరలించక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతు ఆరోపించారు. ధాన్యం బస్తాలను తరలించాలని ఐకెపి సీసీ సావిత్రి ని అడిగితే, దాన్యం తరలించడానికి ఐదు రోజులు అవుతుంది. లేదంటే పది రోజులు కూడా పట్టవచ్చు అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులో తరలించేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Next Story