- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసైన్మెంట్ భూముల పట్టాలు ఇప్పించాలని కలెక్టర్‌ను కోరిన రైతులు
అసైన్మెంట్ భూములకు పట్టాలు ఇప్పించాలని కోరుతూ లింగంపేటకు చెందిన పలువురు రైతులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌ను కోరారు.

దిశ, లింగంపేట: లింగంపేట శివారులోని 983 సర్వే నెంబర్ లో గత 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న అసైన్మెంట్ భూములకు పట్టాలు ఇప్పించాలని కోరుతూ సోమవారం లింగంపేటకు చెందిన పలువురు రైతులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కు వినతి పత్రం అంద జేశారు. తాతల జమాన నుంచి సాగు చేస్తున్న అసైన్మెంట్ భూములు భూభారతి పోర్టల్లో అటవీ భూములుగా నమోదయ్యాయని మానవతా దృక్పథంతో స్పందించి మాకు అసైన్మెంట్ పట్టాలు ఇవ్వాలని బాధిత రైతులు కలెక్టర్ కు విన్నవించారు. లింగంపేట శివారులోని సర్వే నంబర్ 983లో లింగంపేట గ్రామానికి చెందిన 181 మంది రైతులకు 70 ఏళ్ల క్రితం అప్పటి రెవెన్యూ అధికారులు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చారు. పట్టాలు పొందిన నిరు పేద రైతులు అసైన్మెంట్ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు.
రైతు బంధు డబ్బులు రావడం లేదని..
ఇదే సర్వే నంబర్ లో రైతు వేదిక, పోలీస్ స్టేషన్, ఎంపిడిఓ ఆఫీస్, తహసీల్దార్ కార్యాల యం, ప్రభుత్వ హాస్టల్ లు, విద్యుత్ సబ్ స్టేషన్ ఉన్నాయనీ, వీటన్నింటినీ కాదని మేము సాగు చేసుకుంటున్నా వ్యవసాయ భూములను అటవీ భూములుగా మార్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ భూములను అటవీ భూములుగా మార్చడం వల్ల రైతు బంధు డబ్బులు రావడం లేదని, అధికారులు యూరియా ఇవ్వడం లేదని, పండించిన వరి ధాన్యంను కొనుగోలు కేంద్రంలో కొనడం లేదని రైతులు కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అటవీ భూములుగా మార్చిన అసైన్మెంట్ భూములను సాగు చేస్తు న్న 40 మంది రైతులకు తిరిగి అసై న్మెంట్ పట్టాలు ఇచ్చారని, మిగతా 140 మంది రైతులకు అసై న్మెంట్ పట్టాలిచ్చి ఆదుకోవాలని వారు కలెక్టర్ ను కోరారు. ఇదే అంశంపై రైతులు గత సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా ఈరోజు నిర్వహించిన ప్రజావాణిలో రెండోసారి ఫిర్యాదు చేశారు.
జాయింట్ సర్వేకు ఆదేశించిన కలెక్టర్
లింగంపేట శివారులోని 983 సర్వే నెంబర్ లో రైతులు సాగు చేసుకుంటున్న అసైన్మెంట్ భూములను రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఇరు శాఖల అధికారులను ఆదేశించారు. సర్వే నివేదిక ఆధారంగా బాధిత రైతులకు న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు రైతులు చెప్పారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వారిలో లింగంపేట మాజీ ఎంపీపీ ముదాం సాయిలు రైతులు పోకల సాయిరాం, నామాల గంగయ్య, మెతుకు గురు ప్రసాద్, నామాల పోచయ్య, నామాల లక్ష్మి, సుప్పాల సాయిలు, చింతల సత్యవ్వ,చింతల సావిత్రి, తాడ్వాయి భూమయ్య, సందీప్ తదితరులు ఉన్నారు.






