- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్ తో రైతు మృతి
దిశ, నిజాంసాగర్ : పంట పొలంలో స్టాటర్ బాక్స్ వద్ద విద్యుత్ వైర్లు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం మండలంలోని ఆరేడు గ్రామంలో చో

దిశ, నిజాంసాగర్ : పంట పొలంలో స్టాటర్ బాక్స్ వద్ద విద్యుత్ వైర్లు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం మండలంలోని ఆరేడు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆరేడు గ్రామానికి చెందిన గాండ్ల బసప్ప (38) అనే రైతు ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి తన సొంత పొలం కు వెళ్ళగా బోరు నడవడం లేదని గ్రామ శివారులోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో దిగి బోరు మోటర్ ను తన పంట పొలంలో ఉన్న విద్యుత్ వైరు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి ఆరు సంవత్సరాల కూతురు శైలజ, భార్య మంజుల ఉన్నారు. మృతుని భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్సై తెలిపారు.






