సబ్జెక్టు టీచర్ లే ఇన్విజిలేటర్లు అయిన వేళ...

by Disha Web Desk 20 |
సబ్జెక్టు టీచర్ లే ఇన్విజిలేటర్లు అయిన వేళ...
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పదో తరగతి పరీక్షలలో నిజామాబాద్ జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. పరీక్షల నిర్వహణలో సంబంధిత సబ్జెక్టుల టీచర్లకు విధుల కేటాయింపు అనేది పరీక్షల నిబంధనలకు విరుద్ధం. కానీ నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ మాత్రం ప్రైవేట్ యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గి ఏ పరీక్ష జరిగితే ఆ పరీక్షలకు సంబంధించిన టీచర్లను ఇన్విజిలేటర్స్ గా వేయడం గమనార్హం. ఈ వ్యవహారం ఇటీవల రాష్ట్ర పరీక్షల విభాగం పరిశీలకుల తనిఖీలలో బట్టబయలైంది. జిల్లా కేంద్రంలోని కసాబ్ గల్లి జూనియర్ కళాశాల ఎస్ఎస్సీ పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న చీఫ్ సూపర్డెంట్ శ్రీనివాస్ (మల్లారం స్కూల్ అసిస్టెంట్), పర్వేజ్ (టీచర్ పులాంగ్) అదే సబ్జెక్టు టీచర్లు విధులు కొనసాగించడం పట్ల జాయింట్ డైరెక్టర్ ఆకస్మిక తనిఖీలలో పట్టుబడ్డారు. ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిజామాబాద్ విద్యాశాఖలో పరీక్షలు విభాగం 20 మంది టీచర్ల కనుసన్నలలో అవినీతి అక్రమాలకు కేంద్రబిందువైంది.

ఉపాధ్యాయుల ఇన్విలేషన్లతోపాటు మూల్యాంకనం అంత 20 మంది టీచర్లు చెప్పిన వారికి విధులు కేటాయిస్తారని గత ఐదు సంవత్సరాలుగా అపవాదు మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ఏకంగా విద్యాశాఖ పరీక్షలు విభాగం జాయింట్ డైరెక్టర్ తనిఖీలు ఈ వ్యవహారం బట్టబయలు కావడం విద్యాశాఖ పనితీరుపై విమర్శలకు దారి తీసింది. నిజామాబాద్ జిల్లాలో వందమంది హెడ్మాస్టర్లు ఉండగా వారిని కాదని స్కూల్ అసిస్టెంట్లకు ఏ విధంగా సిఎస్లుగా విధులు ఇస్తారనేది ప్రధాన ఆరోపణ ఉంది. 2012 కు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్లకు సీఎస్ డివోలుగా విధులను కేటాయిస్తున్న నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ ఎందుకు సీనియర్లను పక్కకు పెట్టిందని సమాధానం చెప్పలేక పోతుందని ఉపాధ్యాయ సంఘాల యూనియన్లు ప్రశ్నిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో సీనియర్లు జూనియర్లుగా జూనియర్లు సీనియర్ గా విధులు నిర్వహించడానికి పదో తరగతి పరీక్షలలో నిర్వహణలో వచ్చే కాసుల కారణమన్న ప్రధాన ఆరోపణ ఉంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed