ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య‌ను ప‌రామ‌ర్శించిన పోచారం

by Nallavelli.Anjaneyulu |

నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య‌ను హైద‌రాబాద్ నిమ్స్ ఆసుప‌త్రిలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస‌రెడ్డి ప‌రామ‌ర్శించారు.

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య‌ను ప‌రామ‌ర్శించిన పోచారం
X

దిశ‌, బాన్సువాడ : హైద‌రాబాద్ నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్‌‌ సౌమ్య ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి. సౌమ్య కి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి.. ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. సౌమ్య సంపూర్ణంగా కోలుకుటుందని తిరిగి త్వరగా విధుల్లో చేరాలని ఆశిస్తున్నానాని తెలిపారు. ఈ కార్యక్రమం లో నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి పాల్గొన్నారు.

Next Story