గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి : ఏనుగు శ్రీధర్ రెడ్డి

by Ratna Kumari |   (  Updated:2025-10-05 11:14:12  IST  )

దిశ‌, భిక్క‌నూరు : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని బీజేపీ మండల ఇంచార్జ్ ఏనుగు శ్రీధర్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.

గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి : ఏనుగు శ్రీధర్ రెడ్డి
X

దిశ‌, భిక్క‌నూరు : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని బీజేపీ మండల ఇంచార్జ్ ఏనుగు శ్రీధర్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఆదివారం భిక్కనూరు మండల కేంద్రంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో బూత్ స్థాయి అధ్యక్షులు, పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆదేశాల ప్రకారం.. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాషాయ జెండా ఎగిరే విధంగా పని చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతోపాటు.. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ చేస్తున్న వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఉప్పరి రమేష్, ప్రధాన కార్యదర్శి అత్తెల్లి తిరుమలేష్, పొన్నాల రంజిత్ రెడ్డితోపాటు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Next Story