ప్ర‌తి ఒక్క‌రూ సేవా దృక్ప‌థం అల‌వాటు చేసుకోవాలి : డీఎస్పీ విఠ‌ల్ రెడ్డి

by Ratna Kumari |   (  Updated:2026-04-17 14:16:06  IST  )

పిట్లం అంబేద్క‌ర్ కూడ‌లిలో మాజీ పీఏసీఎస్ చైర్మ‌న్ శ‌ప‌థం రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన చ‌లి వేంద్రాన్ని శుక్ర‌వారం డీఎస్పీ విఠ‌ల్ రెడ్డి ప్రారంభించారు.

ప్ర‌తి ఒక్క‌రూ సేవా దృక్ప‌థం అల‌వాటు  చేసుకోవాలి :  డీఎస్పీ విఠ‌ల్ రెడ్డి
X

దిశ‌, పిట్లం : పిట్లం అంబేద్క‌ర్ కూడ‌లిలో మాజీ పీఏసీఎస్ చైర్మ‌న్ శ‌ప‌థం రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన చ‌లి వేంద్రాన్ని శుక్ర‌వారం డీఎస్పీ విఠ‌ల్ రెడ్డి ప్రారంభించారు. వారాంత‌పు సంతను దృష్టిలో పెట్టుకుని సంతకు వచ్చే ప్రజలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన సంతకు వచ్చిన ప్రజలకు ఉపశమనం కలిగించింది. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ విఠల్ రెడ్డి మాట్లాడుతూ వేసవి కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. సమాజంలో సేవాభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, అవసరమైన చోట సహాయం అందించడం మన బాధ్యత అని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ తిరుపయ్య, ఎస్ఐ ఆంజనేయులు, స్థానిక సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్, నాయకులు రాంరెడ్డి, మోహన్ రెడ్డి, ఇమ్రోజ్, రాజు సెట్, భాస్కర్, బాలకృష్ణ, లింగం, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

Next Story