జిల్లాలో 650 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

by Nallavelli.Anjaneyulu |

దిశ, ఆలూర్ : వానాకాలం సీజన్‌కు గాను ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ కార్యాచరణను

జిల్లాలో 650 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
X

దిశ, ఆలూర్ : వానాకాలం సీజన్‌కు గాను ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. రెండేళ్లుగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జిల్లా మొదటి స్థానంలో ఉండగా ఈసారి కూడా భారీగా ధాన్యం సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్ రి 9 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం వస్తుందని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు ఇందుకు 650 పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో సన్నరకం ధాన్యం ఎక్కువగా వేసినందున కొనుగోలు కేంద్రాలను సన్నారకాలకు, దొడ్డు రకాలకు వేర్వేరుగా ఏర్పాటు చేస్తున్నారు. దసరా తరువాత నుంచి జిల్లాలో బోధన్‌, వర్ని, కోటగిరి ప్రాంతాలలో మొదటి విడత కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాటుకు సిద్ధం చేశారు. ఈసారి ధాన్యం కేటాయింపుల విషయంలో పౌర సరఫరా శాఖ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఖరీఫ్‌ ధాన్యాన్ని కొనుగోలు చేసే రైస్‌ మిల్లర్‌ నుంచి ముందుగానే బ్యాంక్‌ గ్యారంటీ తీసుకోనున్నారు. గన్ని బ్యాగులకు సంబంధించి మొదటి విడతకు సరిపడా గన్ని బ్యాగులను జిల్లాలో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలియజేశారు.

జిల్లాలో 650 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

జిల్లాలో అక్టోబర్‌ మొదటి వారంలోనే వరి కోతలు ప్రారంభం కానున్నాయి. దసరా తర్వాత రైతులు కోతలకు సిద్ధమవుతారు. రాష్ట్రంలో ముందుగా బోధన్‌ డివిజన్‌ పరిధిలోని బోధన్‌, వర్ని, కోటగిరి, రుద్రూర్‌, చందూర్‌, మోస్ర మండలాల్లో కోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 650 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వర్షాకాలం ముగిసినప్పటికీ అకాల వర్షాలు పడే అవకాశం ఉండటంతో టార్చాలిన్‌ కవర్లను ముందుగానే సిద్ధం చేస్తున్నారు. గత యాసంగి సీజన్‌లో వర్షాల కారణంగా రోడ్లపై, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నందున ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సన్నరకం, దొడ్డు రకాల ధాన్యాలకు వేర్వేరు కేంద్రాలను ఏర్పాటు చేసి, టెంట్లు, నీటి వసతులు కల్పించనున్నారు.

బిల్లుల చెల్లింపులో ఆలస్యం జరగకుండా చర్యలు

గత యాసంగి సీజన్‌లో రైతులు అమ్మిన ధాన్యానికి డబ్బులు ఖాతాలో జమ కావడానికి నెలల సమయం పట్టింది. ట్యాబ్‌ ఎంట్రీలో నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈసారి ఆ సమస్యలు రాకుండా ట్యాబ్‌ ఎంట్రీ వేగవంతం చేయాలని, ధాన్యం మిల్లులకు వేగంగా తరలించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

అక్రమాలపై క్రిమినల్‌ కేసులు

ధాన్యం సేకరణ, ట్యాబ్‌ ఎంట్రీ, మిల్లులకు తరలింపులో ఏవైనా అక్రమాలు చోటుచేసుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే కొంతమంది మిల్లర్లను బ్లాక్‌లిస్టులో చేర్చగా, భవిష్యత్తులో కూడా పారదర్శకంగా వ్యవహరించని వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈసారి వానకాలం వరి ధాన్యం సేకరణ సాఫీగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.

రికార్డు స్థాయిలో ధాన్యం వచ్చే అవకాశం..

గత ఏడాది యాసంగి,వానాకాలం సీజన్‌లో జిల్లా రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.ఈ వానాకాలం సీజన్‌లో కూడా రికార్డు స్థాయిలో కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 4లక్షల 37 వేలకు పైగా ఎకరాలల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. ప్రభుత్వం బోనస్‌ ప్రకటించడంతో జిల్లాలో సన్నరకం ధాన్యాన్ని అధికంగా పండిస్తున్నారు. కాగా, 9 లక్షలకు పైగా మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story