- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జోర్డాన్ ఎడారిలో చిక్కుకున్న ఏర్గట్ల యువకుడు
దిశ, ఏర్గట్ల : మంచి జీవితం కోసం గల్ఫ్ దేశం వెళ్లిన ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన వాల్గొట్ గంగాధర్, ఏజెంట్ మోసానికి బలై జోర్డాన్ ఎడారిలో చిక్కుకున్నాడు. ఆకర్షణీయమైన జీతంతో

దిశ, ఏర్గట్ల : మంచి జీవితం కోసం గల్ఫ్ దేశం వెళ్లిన ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన వాల్గొట్ గంగాధర్, ఏజెంట్ మోసానికి బలై జోర్డాన్ ఎడారిలో చిక్కుకున్నాడు. ఆకర్షణీయమైన జీతంతో ఉద్యోగం చూపిస్తామని చెప్పి పంపించి ఏజెంట్లు మోసం చేస్తున్నారు. గంగాధర్ అక్కడికీ చేరుకున్న తరువాత ఉద్యోగం లేకపోవడంతో ఎడారిలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. గత ఆరు నెలలుగా జోర్డాన్‌లో ఆహారం, వసతి లేక సతమతమవుతున్నట్టు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన బాల్కొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ తన అనుచరులను గంగాధర్ ఇంటికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. స్థానిక నాయకులు గుల్లె రాజేశ్వర్, తుపాకుల శ్రీనివాస్ గౌడ్, గూండ్ల సదానంద్, రాములు, ఎండి మునీర్, రొక్కెడ సంజీవ్, లూన సాయన్న తదితరులు బాధితుని ఇంటికి వెళ్లి ఆయన తల్లిదండ్రులను కలిసి పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకుని పరిస్థితిని వివరించారు. వెంటనే స్పందించిన ఈరవత్రి అనిల్ బాధితుడిని స్వదేశానికి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఆయన అనుచరులు తెలిపారు.






