- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ స్పెషల్ బ్రాంచ్ నూతన కార్యవర్గం ఎన్నిక
దిశ, కామారెడ్డి టౌన్ : జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ స్పెషల్ బ్రాంచ్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. గురువారం టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి

దిశ, కామారెడ్డి టౌన్ : జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ స్పెషల్ బ్రాంచ్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. గురువారం టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యవర్గ సభ్యులు కే శివకుమార్ ఎన్నికల అధికారిగా కామారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ స్పెషల్ బ్రాంచ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. .టీఎన్జీవో కేంద్ర సంఘం ఆదేశానుసారం కామారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ స్పెషల్ బ్రాంచ్ నూతన కార్యవర్గం ఏర్పాటుకు ఎన్నికలను నిర్వహించారు. టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యవర్గ సభ్యులు కే శివకుమార్ అన్ని పదవులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు.
నూతన కార్యవర్గం
కామారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ స్పెషల్ బ్రాంచ్ నూతన అధ్యక్షులుగా సాయి కృష్ణ,కార్యదర్శిగా నవిత, కోశాధికారిగా బి. నరేందర్, కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు ఎన్ వెంకట్ రెడ్డి,కార్యదర్శి ఎం నాగరాజు,జిల్లా సహాధ్యక్షులు ఎం చక్రధర్.కోశాధికారి ఎం దేవరాజు, టిఎన్జీవోస్ కేంద్ర సంఘం మెంబర్ కె శివకుమార్ కామారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.






