మొంథా తుఫాన్ ప్ర‌భావం.. రైతులు తీవ్ర ఇబ్బందులు

by Ratna Kumari |

దిశ‌, క‌మ్మ‌ర్ ప‌ల్లి : మొంథా తుఫాన్ ప్ర‌భావంతో రైతుల‌ను తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వ‌ద్ద రైతుల పంట త‌డిసిపోతుంది. మ‌రికొంద‌రూ

మొంథా తుఫాన్ ప్ర‌భావం.. రైతులు తీవ్ర ఇబ్బందులు
X

దిశ‌, క‌మ్మ‌ర్ ప‌ల్లి : మొంథా తుఫాన్ ప్ర‌భావంతో రైతుల‌ను తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వ‌ద్ద రైతుల పంట త‌డిసిపోతుంది. మ‌రికొంద‌రూ ఆర‌బెట్టుకోవాల‌ని ధాన్యం కొనుగోలు వ‌ద్ద‌కు వ‌స్తే.. ధాన్యం ఆరేది ఏమో కానీ త‌డిసేదే ఎక్కువగా ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌ధానంగా క‌మ్మ‌ర్ ప‌ల్లి మండ‌ల కేంద్రంతో పాటు ప‌లు గ్రామాల్లో మంగ‌ళ‌వారం వ‌ర్షం కురువ‌డంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఆర‌బెట్టిన రైతులు ధాన్యం త‌డ‌వ‌కుండా నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో తూకుల‌కు సిద్ధం చేసినా ధాన్యం త‌డిసిపోవ‌డంతో రైతులు అల్లాడిపోయారు. మరి కొన్ని చోట్ల అయితే క‌ల్లం పై పోసిన రాశుల కింద‌కు వ‌ర్ష‌పు నీరు చేరిపోయింది. రైతులు గ‌గ్గోలు పెడుతున్నారు. అకాల వ‌ర్షం అన్న‌ధాత‌ల్లో అనునిత్యం ఆందోళ‌న రేకెత్తిస్తోంది. ఎప్పుడూ వ‌ర్షం కురుస్తుందోన‌ని భ‌యాందోళ‌న‌లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. మండ‌లంలోని ఉఫ్లూర్ గ్రామం చివ‌రిలో రైతు వేదిక వ‌ద్ద తూకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం కూడా కొంత మేరకు త‌డిసిపోయింది. దీంతో ఆ రైతు ల‌బోదిబోమంటూ రోధిస్తున్నాడు. మొత్తానికి మొంథా తుఫాన్ రైతుల‌ను క‌న్నీరు పెట్టించేందుకే వ‌స్తుంద‌ని వాపోతున్నారు రైతులు.

Next Story