- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం : ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్లడమే ప్రభుత్వ ద్వేయమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.

దిశ, నిజాంసాగర్ : మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్లడమే ప్రభుత్వ ద్వేయమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. మత్స్య అభివృద్ధి పథకం కింద 100% సబ్సిడీపై చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా గురువారం నిజాంసాగర్ మండలం పెద్ద ఆరేపల్లి గ్రామంలోని రిజర్వాయర్ వద్ద మూడు రకాల చేప పిల్లలు రోహు, కట్ల, మ్రీగాల,రకాలకు చెందిన 48 లక్షల 18 వేల చేప పిల్లలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చేప పిల్లలను లాంఛనంగా వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మత్స్యకారుల జీవనోపాధి కల్పించి, వారి జీవితాలలో వెలుగులు నింపాలనేదే ప్రభుత్వ ఆశయమన్నారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చేపల పెంపకం ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు మత్స్యకారుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుందని మత్స్యకారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చేపల పెంపకం యూనిట్లను ఏర్పాటు చేసి, నియంత్రిత వాతావరణంలో చేపలను పెంచి వాణిజ్య అవసరాల కోసం ఉత్పత్తి చేసే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి డోల్ సింగ్, జిల్లా మత్స్యశాఖ అధ్యక్షుడు గాదం సత్యనారాయణ, పిట్లం వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,మత్స్య శాఖ ఉపాధ్యక్షుడు పసుపుల పెద్ద సాయిలు,ఎంపీడీవో శివకృష్ణ,సర్పంచులు మోహన్,సంకు లక్ష్మయ్య, కేతావత్ నారాయణ, ఎన్ఎఫ్సిఎంఎస్ ఉపాధ్యక్షుడు బోయి రాములు,నాయకులు గౌస్ పటేల్,అబ్దుల్ కలేక్,డాక్టర్ నారాయణ,మంద బలరాం,బంగ్లా ప్రవీణ్ కుమార్,మీనా సింగ్ సిబ్బంది ఏలేష్, నవీన్, సురేష్, దశరథ్,నరేష్, మత్స్యకారులు పాల్గొన్నారు.






