IDCMS చైర్మన్ పదవికి గండం.. సొసైటీ చైర్మన్ పదవికి సాంబార్ మోహన్ ముందస్తు రాజీనామా

by Disha Web Desk 9 |
IDCMS చైర్మన్ పదవికి గండం.. సొసైటీ చైర్మన్ పదవికి సాంబార్ మోహన్ ముందస్తు రాజీనామా
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఇందూర్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ సాంబార్ మోహన్‌‌కు పదవి గండం. బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రధాన అనుచరుడైన సాంబార్ మోహన్ తన సొంత గ్రామమైన నల్లవెల్లి వ్యవసాయ ప్రాథమిక సొసైటీ చైర్మన్ పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఇటీవల నల్లవెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ సభ్యులు చైర్మన్ సాంబార్ మోహన్‌పై అవిశ్వాసం నోటీసులు ఇచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత జిల్లాలో సహకార సంఘాల్లో, మున్సిపాలిటీల్లో, మండల పరిషత్తులలో అవిశ్వాసం నోటీసుల పంచాయతీ పెరిగింది. ఇటీవల జరిగిన అవిశ్వాస ప్రక్రియలో నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తన పదవిని కాపాడుకునేందుకు సాంబార్ మోహన్ కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, స్థానిక ఎమ్మెల్యే రేకుల భూపతిరెడ్డి వర్గం అడ్డుకుంది. నిజామాబాద్ ఐడిసి ఎంఎస్ పాలకవర్గంలో బీఆర్ఎస్‌కు తగినంత సంఖ్యా బలంగా ఉండటంతో అక్కడ ఐడీసీఎంఎస్ చైర్మన్ పదవిని దక్కించుకోవడం కాంగ్రెస్‌కు సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలోని ఆయన డిసియం ఏస్ డైరెక్టర్‌గా ఉండడానికి కారణమైన నల్లవెల్లి ప్రాథమిక సొసైటీ చైర్మన్ పదవిపై అవిశ్వాసం పెట్టి దానిని అనుగుణంగా సాంబార్ మోహన్ పదవిచ్చుతుని చేయాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేయగా ఆయన ముందస్తుగానే రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికలకు వెళ్లే ముందు ప్రధానంగా బాజిరెడ్డి అనుచరుడికి పదవి కోల్పోవడం నియోజకవర్గంలో పెద్ద దెబ్బగా చెబుతున్నారు.

Next Story

Most Viewed