సీజ‌న‌ల్ వ్యాధులు అరిక‌ట్టేందుకే డ్రై డే-ఫ్రైడే

by Ratna Kumari |

స‌దాశివ‌న‌గ‌ర్ మండ‌లం స‌జ్జానాయక్ తండాలో శుక్ర‌వారం ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు డ్రైడే ఫ్రైడే కార్య‌క్రమాన్ని నిర్వ‌హించారు.

సీజ‌న‌ల్ వ్యాధులు అరిక‌ట్టేందుకే డ్రై డే-ఫ్రైడే
X

దిశ‌, స‌దాశివ‌న‌గ‌ర్ : స‌దాశివ‌న‌గ‌ర్ మండ‌లం స‌జ్జానాయక్ తండాలో శుక్ర‌వారం ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు డ్రైడే ఫ్రైడే కార్య‌క్రమాన్ని నిర్వ‌హించారు. గ్రామ‌స్తుల‌కు ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త పై అవ‌గాహ‌న క‌ల్పించారు. ఇళ్ల వద్ద చెత్త నిలువలు ఉండరాదని, పనికిరాని వస్తువులు, పాడైపోయిన వస్తులు ఉంచరాదన్నారు. వీటి వల్ల దోమలు అధికమై విష జ్వరాలు వ్యాప్తి చెందుతాయని ప్రజలకు సూచించారు.

యాచారం తండాలో..

దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు డ్రై డే ఫ్రైడే నిర్వహిస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. సదాశివ నగర్ మండలం యాచారం తండాలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తనలో మురికి కాలువల పూడికతీ త, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, యాంటీ లార్వా స్ప్రే చేశారు. ఇళ్ల‌లో నిలువ ఉన్న నీటిని పారబోయాలని ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు.

Next Story