- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదు
మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదని ధర్మపురి సర్కిల్ ఇన్ స్పెక్టర్ రాం నర్సింహారెడ్డి వాహనదారులను హెచ్చరించారు.

X
దిశ, గొల్లపల్లి : మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదని ధర్మపురి సర్కిల్ ఇన్ స్పెక్టర్ రాం నర్సింహారెడ్డి వాహనదారులను హెచ్చరించారు. ఆదివారం గొల్లపల్లి మండలంలోని గోవిందుపల్లి చౌరస్తాలో ధర్మపురి సీఐ రాం నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో గొల్లపల్లి ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి తన సిబ్బందితో కలసి వాహనల తనిఖీ నిర్వహించారు. ఈ తనీఖీల్లో నలుగురు వ్యక్తులు మద్యం తాగి పట్టుపడ్డారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని వాహనదారులకు సూచించారు. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రుల మీద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Next Story






