ఈ జిల్లాలో మొదటి రోజే ఎంత మంది డుమ్మా కొట్టారో తెలుసా..?

by Naveena |

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 38 సెంటర్లలో మొదటి రోజు మొదటి సంవత్సరం పరీక్ష జరిగాయి.

ఈ జిల్లాలో మొదటి రోజే ఎంత మంది డుమ్మా కొట్టారో తెలుసా..?
X

దిశ, కామారెడ్డి : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 38 సెంటర్లలో మొదటి రోజు మొదటి సంవత్సరం పరీక్ష జరిగాయి. బుధవారం జరిగిన పరీక్షలో 9230 మంది విద్యార్థులకు గాను 8863 మంది విద్యార్థులు హాజరు కాగా.. 347 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ గ్రూప్ లో 7786 మందికి గాను 7555 మంది హాజరు కాగా.. 231 మంది గైర్హాజరు అయ్యారు. వొకేషనల్ గ్రూప్ లో 1444 మంది విద్యార్థులకు గాను 1308 మంది హాజరు కాగా, 116 మంది గైర్హాజరయ్యారు. కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాల కేంద్రాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలకు పంపించే సమయంలో ప్రతీ విద్యార్థిని తప్పనిసరిగా పరిశీలించి పంపించాలని తెలిపారు. గడియారాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెస్ కూడా అనుమతించ కూడదని తెలిపారు. అనధికార వ్యక్తులను లోనికి పంపించకూడదని తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకుండా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖాధికారి షేక్ సలాం, తదితరులు పాల్గొన్నారు.

Next Story