- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదం జరిగితే తప్ప అధికారులు స్పందించరా..?
దిశ, నిజాంసాగర్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో 55 రోజులుగా 12 గేట్ల నుండి 16 గేట్ల

దిశ, నిజాంసాగర్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో 55 రోజులుగా 12 గేట్ల నుండి 16 గేట్ల నుండి, 20 గేట్ల నుండి నీటి విడుదల చేసిన నీటి పారుదల శాఖ అధికారులు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో 16 గేట్ల ద్వారా నీటి విడుదలను నిలిపివేశారు. దీంతో లీకేజీ వాటర్ తో నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట శివారులోని నాగమడుగు లోలేవల్ వంతెన నుండి వెళ్లాల్సిన రహదారి నుండి పూర్తి స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతుంది. నిజాంసాగర్ నుంచి అచ్చంపేట, లింగంపల్లి, మర్పల్లి, బ్రాహ్మణపల్లి, ఆరేపల్లి, ఆరేడు, మాసన్ పల్లి, గ్రామాల ప్రజలు, మోడల్ స్కూల్ లకు వెళ్లాల్సిన విద్యార్థులు, ప్రయాణికులు సైతం నీటి ప్రవాహం నుండి వెళ్లడంతో ప్రమాదాలు జరిగే సంఘటన ఉన్నప్పటికీ అధికారులు మట్టుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో నిజాంసాగర్ నుంచి అచ్చంపేట వైపుగా వెళ్లడానికి ప్రయత్నించిన ఒక కారు అనుకోకుండా ప్రమాదంలో చిక్కింది. డ్రైవర్ చాకచక్యంతో దాన్ని దాటవేయడంతో ప్రమాదం బారి నుంచి బయటపడ్డారు. నీటి ఉదృతి ఎక్కువున్నప్పటికీ ప్రయాణికుల నివారించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిని పలువురు ప్రశ్నిస్తున్నారు. భారీకేడ్లు ఏర్పాటు చేసి ప్రయాణికులను నివారించాల్సిన ప్రమాదం నుండి కాపాల్సిన అధికారులు సైతం లేకపోవడంతో పలు విమర్శలకు తావిస్తుంది. ప్రమాదం సంభవిస్తే తప్ప అధికారులు స్పందించరా..? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ప్రమాదమని తెలిసినా ప్రయాణికులు నివారించడంలో అధికారుల వివరాలు పలు విమర్శలకు దారితీస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.






